నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం క్రేజీ సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. అఖండతో మొదలైన బాలయ్య దండయాత్ర ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి తో మరో లెవల్ కి తీసుకువెళ్లాడు. ప్రస్తుతం బాలయ్య తన 108వ సినిమాను స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడితో చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్యకి జంటగా అందాల భామ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా మరో కీలక పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.
ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య తన హోమ్లీ డైరెక్టర్ బోయపాటితో కలిసి ఓ భారీ పొలిటికల్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను 2024 ఎలక్షన్ ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా బాలకృష్ణ మరో ప్రాజెక్టు గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జాంబీరెడ్డి, కల్కి సినిమాలతో టాలెంట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మతో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే బాలయ్య ఈ సినిమా కథను కూడా ఓకే చేసేసారట. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం సూపర్ హీరో హనుమాన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ‘అధీర’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత బాలకృష్ణ సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.
ఈ యువ క్రేజీ దర్శకుడు హాలీవుడ్ రేంజ్‌లో ఓ సినిమాటిక్ యూనివర్స్‌తో ఓ కొత్త సూపర్ హీరోస్ ప్రపంచంలోకి తీసుకువెళ్లబోతున్నాడని తెలుస్తుంది. ఈ ప్రపంచంలోకి బాలయ్య కూడా రాబోతున్నాడట.
ప్రశాంత్‌వర్మ ఈ విషయాన్ని లీక్ చేయడంతో బాలయ్య అభిమానులు ఈ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ?వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఇప్పటికే బాలయ్యతో ఆన్ స్టాపబుల్ ప్రోమో, ట్రైలర్‌ను తెరకెక్కించగా వాటికే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.