త‌న కెరీర్‌లో ఫ‌స్ట్ టైం అంత రెమ్యున‌రేష‌న్ తీసుకోబోతోన్న బాల‌య్య‌… హ‌య్య‌స్ట్ ఫిగ‌ర్ ఇది…!

టాలీవుడ్ లో థియేట్రిక‌ల్ మార్కెట్‌తో పాటు నాన్ థియేట్రిక‌ల్ మార్కెట్ కూడా పెరుగుతోంది. దీంతో హీరోల నుంచి మొద‌లు పెట్టి అందరి రెమ్యూనిరేషన్లు విప‌రీతంగా పెరుగుతూనే ఉన్నాయి. క‌రోనా త‌ర్వాత ఓటీటీ, నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ రేట్లు బాగా పెరిగాయి. నిర్మాత‌ల‌కు ఆదాయం కూడా గ‌ట్టిగానే వ‌స్తోంది.

దీంతో హీరోల రెమ్యున‌రేష‌న్ బాగా ఇంక్రీజ్ అవుతోంది. అయితే ఎంద‌రు హీరోలు రేట్లు మార్చినా, కొంద‌రు హీరోలు సినిమా సినిమాకు రేటు పెంచేసినా న‌ట‌సింహం బాల‌య్య మాత్రం ఎప్పుడూ నిర్మాత‌ల హీరోగా ఉండేందుకే ఇష్ట‌ప‌డ‌తారు. అస‌లు బాల‌య్య ఎప్పుడు రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఎవ్వ‌రిని డిమాండ్ చేయ‌రు. బాలయ్య రెమ్యూనిరేషన్ చాలా చాలా రీజనబుల్ అని ఇండ‌స్ట్రీ వాళ్లు కూడా మెచ్చుకుంటూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే అఖండ సినిమాకు ముందు బాలయ్య రెమ్యూనరేషన్ 10 కోట్ల రేంజ్‌లో ఉండేది. ఇక్క‌డ మ‌రో విశేషం కూడా ఉంటుంది. బాల‌య్య సినిమా ఒప్పుకునే ముందు ఓ రెమ్యున‌రేష‌న్ అనుకుంటారు. సినిమా రిలీజ్‌కు ముందు దానిని అవ‌స‌రాన్ని బ‌ట్టి త‌గ్గించే వెసులు బాటు కూడా ఉంటుంది. అందువ‌ల్ల నిర్మాత‌ల‌కు పెద్ద ఇబ్బంది ఉండ‌దు.

అస‌లు ర‌వితేజ లాంటి మీడియం రేంజ్ హీరోలు కూడా ఏనాడో రు. 20 కోట్లు దాటేశారు. బాల‌య్య అఖండ త‌ర్వాత వీర‌సింహారెడ్డికి కూడా కేవ‌లం రు. 14 కోట్ల రేంజ్‌లోనే తీసుకున్నారు. ఇప్పుడు భ‌గ‌వంత్ కేస‌రికి కూడా అదే రేంజ్‌లో పుచ్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఫ‌స్ట్ టైం బాబి సినిమాకు బాల‌య్య రెమ్యున‌రేష‌న్ రు. 25 కోట్ల రేషియోలో ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది.

సీనియ‌ర్ హీరోల్లో చిరంజీవి రు. 50 కోట్ల‌కు పైనే తీసుకుంటున్నారు. నాగ్‌, వెంకీ రు. 10 కోట్ల లోపులోనే ఉన్నారు. ఇప్పుడు రెండు వ‌రుస హిట్ల‌తో పాటు కెరీర్‌లోనే ఫుల్ ఫామ్‌లో ఉన్న బాల‌య్య కూడా ఫ‌స్ట్ టైం రు. 20 కోట్ల రెమ్యున‌రేష‌న్ రేంజ్ దాటేసి రు. 25 కోట్ల‌కు చేరువ అవుతున్నాడు. ఇది బాల‌య్య కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ కావ‌డం విశేషం.