అందం కోసం అది చేయించుకున్న బాల‌య్య మ‌ర‌ద‌లు..!

హీరోయిన్లకు అందం చాలా ఇంపార్టెంట్. హీరోయిన్లు అందంగా కనిపించేందుకు రకరకాల పద్ధతులు అవలంభిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు హీరోయిన్లు కొన్ని భాగాలకు శాస్త్ర చికిత్సలు కూడా చేయించుకుంటారు. ఇది కొంత రిస్క్ అయినా కూడా ఏమాత్రం వెనుకాడరు. తమ అందాలను శస్త్ర చికిత్సల ద్వారా మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటారు. టాలీవుడ్ లో వీర సింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది.

కానీ హానీరోజ్ అంతకుముందు కొన్ని సినిమాలలో నటించిన రాని గుర్తింపు వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య మరదలుగా ఎప్పుడు ? అయితే నటించిన అప్పటినుంచి ఆమెకు బాగా పాపులారిటీ వచ్చేసింది. సోషల్ మీడియాలో కూడా ఆమె బాగా ఫ్రెండ్ అవుతుంది. ఇప్పుడు హనీ రోజ్‌ ఏం చేసినా ? ఒక సెన్షేష‌న్‌? మలయాళ అమ్మాయి అయిన హానీ వైదిల్ బాయ్ ఫ్రెండ్ అనే మలయాళ సినిమాతో 2004లో హీరోయిన్గా పరిచయం అయింది.

అక్కడ కొన్ని సినిమాలలో నటిస్తూ తమిళంలో కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేసింది. ఇన్నేళ్ల‌ వయసు వచ్చినా ఇప్పటికీ హీరోయిన్గా కొనసాగుతున్న ఆమెకు వీరసింహారెడ్డి సినిమాతో వచ్చిన గుర్తింపు ఎప్పుడు రాలేదు. హానీరోజ్‌కు ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 33 లక్షల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు.

ఇటీవల తన అందం గురించి జరుగుతున్న ట్రోలింగ్పై స్పందించింది. హీరోయిన్గా ఈ గ్లామర్ రంగంలో తన అందం కాపాడుకోవడం కూడా ముఖ్యమే అని పేర్కొంది. అందుకోసం అనేక సౌందర్య సాధనాలను వాడుతూ ఉంటానని.. కొందరు ప్రచారం చేస్తున్నట్టు తాను ఎలాంటి శాస్త్ర చికిత్సలు చేయించుకోలేదని స్పష్టం చేసింది. న‌టిగా ఇన్నేళ్లపాటు కొనసాగటం సాధారణమైన విషయం కాదని.. అందం అనేది భగవంతుడు సృష్టి అని ఆమె చెప్పుకొచ్చింది.