బాల‌య్య న‌మ్మించి మోసం చేసి.. ఇప్పుడు ఇండ‌స్ట్రీ నుంచి అడ్ర‌స్ లేకుండా పోయింది ఎవ‌రో తెలుసా..!

బాలయ్య మనస్సు మంచి మనస్సు అనే సంగతి తెలిసిందే. ఎవరైనా తనను నమ్మితే బాలయ్య ప్రాణాలిచ్చేంత ప్రేమ కనబరుస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. తన గురించి ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేసినా ఆ కామెంట్లను సైతం స్పోర్టివ్ గా తీసుకునే మంచిగుణం బాలయ్యకు ఉంది. అయితే ఇంత మంచి గుణాలు ఉన్న బాలయ్యను సైతం చాలామంది దర్శకులు మోసం చేశారు. బాలయ్య నమ్మి అవకాశమిస్తే నిండా ముంచేశారు.

బాల‌కృష్ణ‌కు స్టార్ డ‌మ్ తెచ్చిన ఫ‌స్ట్ డైరెక్ట‌ర్ ఆయ‌నే... అన్ని సూప‌ర్  హిట్లే..! - Telugu Lives

గత 22 ఏళ్లలో బాలయ్య నటించిన సినిమాలలో హిట్ సినిమాలు ఏవి అనే ప్రశ్నకు నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహ, సింహా, లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి, అఖండ, వీరసింహారెడ్డి సినిమాల పేర్లు మాత్రమే సమాధానంగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలు కాకుండా బాలయ్య నటించిన సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. బాలయ్య ఫ్లాప్ సినిమాల డైరెక్టర్లు బాలయ్య నమ్మకాన్ని వమ్ము చేశారు.

Jr NTR birthday wishes to Babai Balakrishna

కథ చెప్పే సమయంలో బాలయ్యకు ఎలా కథ చెబితే నచ్చుతుందో తెలుసుకుని ఈ డైరెక్టర్లు అలాగే కథ చెప్పేవారు. కథ పరవాలేదనే విధంగా ఉన్నా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా కథనంపై ఏ మాత్రం దృష్టి పెట్టకుండా సినిమాలను తెరకెక్కించేవారు. సినిమా షూటింగ్ సమయంలోనే రిజల్ట్ తెలిసిపోయినా నిర్మాతలను ఇబ్బంది పెట్టలేక బాలయ్య కొన్ని చెత్త కథలతో తెరకెక్కిన సినిమాలలో సైతం నటించారు. కొంతమంది డైరెక్టర్లు తనను మోసం చేయడం బాలయ్య బాధ పడిన సందర్భాలు సైతం ఉన్నాయి.

Balakrishna in 'Chennakesava Reddy'

అయితే బాలయ్యను ఈ విధంగా మోసం చేసి బాలయ్యకు ఫ్లాపులిచ్చిన డైరెక్టర్లు ఎవరూ ఇప్పుడు అడ్రస్ లేరనే సంగతి తెలిసిందే. బాలయ్యతో సినిమా తీసిన ఒక డైరెక్టర్ అయితే సెట్ లోకి తాగొచ్చి బాలయ్యతో సన్నివేశాలను షూట్ చేశారట. ఈ తరహా ఘటనలు కోపం తెప్పించినా బాలయ్య మాత్రం సైలెంట్ గా ఉండేవారట. బాలయ్య మంచితనమే ఆయనకు శ్రీరామరక్ష అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.