టీజ‌ర్‌తోనే రికార్డులు సెట్ చేసిన బాల‌య్య‌.. ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ టీజ‌ర్ సెన్షేష‌న‌ల్.. !

టాలీవుడ్ స్టార్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమా భ‌గ‌వంత్ కేస‌రి. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వ‌స్తోన్న ఈ సినిమాపై సినీ అభిమానుల్లోనూ, ట్రేడ్ వ‌ర్గాల్లోనూ మామూలు అంచ‌నాలు అయితే లేవు.

తాజాగా బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టీజర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. టీజ‌ర్‌లో బాల‌య్య చెప్పిన డైలాగుల‌తోనే ఫ్యాన్స్‌కు పూన‌కాలు స్టార్ట్ అయ్యాయి. అటు తెలుగు డైలాగులు, ఇటు హిందీ డైలాగులు మామూలుగా గూస్ బంప్స్ తెప్పించ‌లేదు. అస‌లు జ‌స్ట్ చిన్న టీజ‌ర్‌తోనే సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా ? అన్నంత ఆతృత క‌లిగేలా చేయ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు.

ఇక థ‌మ‌న్ నేప‌థ్య సంగీతం కూడా అదిరిపోయింది. అయితే ఈ టీజ‌ర్ 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బాలయ్య కెరీర్ లోనే 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన టీజర్ గా రికార్డుల్లోకి ఎక్కింది. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో ఏకంగా 12 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతుంది.

ప్రస్తుతం యూ ట్యూబ్ టాప్ లో ట్రెండ్ అవుతోన్న వీడియోగా కూడా నిలిచింది. ఇక సైన్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీ లీల లీడ్ రోల్స్ లో నటిస్తుండ‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మెయిన్ విల‌న్‌ పాత్రలో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండ‌గా.. ద‌స‌రాకు రిలీజ్ చేయ‌నున్నారు.