నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఫుల్ జోష్ మీద ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడితో కలిసి భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే టాలీవుడ్ సెన్సేషన్ శ్రీ లీల కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకులుముందుకు రానుంది.
ఇక బాలకృష్ణ సినిమాల గురించి చెప్పాలంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మాస్ డైలాగ్లు, ఫైట్లు, ఫ్యాక్షన్ సన్నివేశాలు. ప్రధానంగా బాలయ్య నటించే సినిమాల్లో దాదాపు అరడజనకు పైగా ఫైట్ సీన్స్ ఉండాల్సిందే లేకుంటే ఆయన అభిమానులు అసలు ఒప్పుకోరు. అయితే ఇక్కడ ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. ఒక ఫైట్ సీన్ లేకపోయినా సరే గతంలో బాలయ్య నటించిన ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
ఇక ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే నారీ నారీ నడుమ మురారి.. సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్యకు జంటగా శోభన- నిరోషా హీరోయిన్లగా నటించారు. శారద, కైకాల సత్యనారాయణ, అల్ల రామలింగయ్య, రమాప్రభ వంటి వారు కీలకపాత్రలో నటించారు. యువచిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై కే.మురారి ఈ సినిమాను నిర్మించారు. 1990లో ఫ్యామిలీ సినిమాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అదేవిధంగా కమర్షియల్ గా కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
ఈ సినిమా పాటలు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటికీ ఈ సినిమా పాటలు ట్రెండింగ్ లోనే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్క ఫైట్ సీన్ కూడా ఉండదు. అయినా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించిందంటే కథ, కథనంలో ఉన్న దమ్ము మరియు బాలయ్య నటనే అందుకు ముఖ్య కారణం. ఇక ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ తమిళనాడులో వేల్చరి అనే ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ హౌస్ లోనే జరిగిందట.
ఆల్మోస్ట్ ఈ సినిమా షూటింగ్ మొత్తం అక్కడే కంప్లీట్ చేశారట. బాలయ్య అంటేనే మాస్ సినిమాలకు, భారీ ఫైట్లకు పెట్టింది పేరు అలాంటి మాస్ హీరోతో సినిమా చేసే దర్శకుడు సినిమాలో ఒక ఫైట్ కూడా లేకుండా సినిమా చేయాలంటే ముందుగా అయిన అభిమానులు ఒప్పుకోరు. అది అప్పుడైతే చెల్లింది కానీ ఇప్పుడు బాలయ్య బాబు అంటేనే ఫైట్ లేనిదే సినిమా ఉండదు అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.