ఎస్ ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమలోనే అగ్ర హీరోగా పాపులారిటీ తెచ్చుకున్న ఓ టాలీవుడ్ స్టార్ హీరో కూడా విడాకులు తీసుకోబోతున్నారా..? అంటే అవుననే గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ లో లవ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ కుర్ర హీరో తన క్లాస్మేట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లయిన దగ్గర నుంచి ఆ హీరోకి ఎన్ని సినిమాలు చేసినా అసలు కలిసి రావడం లేదు. అంతేకాకుండా తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఓ గొప్ప ఇంటి అమ్మాయి. కొన్ని కోట్ల ఆస్తికి ఒక్కగానొక్క వారసురాలు. వాళ్ల పేరెంట్స్ ఎంతో గారాబంగా పెంచారట. ఈ సమయంలోనే పెళ్లి తర్వాత అసలు హిట్ కొట్టని ఈ హీరోకి ఇంట్లో అసలు మర్యాదలు కూడా ఇవ్వట్లేదు అట. ఆ హీరో చేసిన ప్రతి పనిని రాద్ధాంతం చేస్తూ గొడవలు పెడుతూ. ఆర్థికంగా కూడా ఆ హీరోని భార్య, అత్తమామలు కలిసి పాతాళానికి తొక్కేసారని అంటున్నారు.
ఇక ఇప్పుడు దీంతో హీరో చేతిలో ఖర్చులకు డబ్బులు కావాలన్నా తన భార్య అత్తమామల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందట. దీంతో ఈ భార్యాభర్తలకి మాట మాట పెరిగి ఎవరికి వారు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ గొడవలు విడాకులు వరకు వెళ్తున్నట్లు మరో వార్త వినిపిస్తుంది. ఒకవేళ నిజం అయితే మాత్రం చిత్ర పరిశ్రమలో ఈ విడాకులు ఎంతో సంచలనం అవుతాయన్న చర్చలే ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.