ఓ స్టార్ హీరో పుట్టినరోజు వస్తుంది అంటే చాలు.. ఆ హీరోల అభిమానుల ఆనందానికి అవధలు ఉండవు. అలాంటిదిప్పుడు బాలకృష్ణ పుట్టినరోజు అంటే మామూలుగా ఉండదు. ఎవరు ఊహించని అప్డేట్లతో మోత మోగాల్సిందే. ఇప్పుడు అదే రూట్లో బాలయ్య పుట్టినరోజుకి ఎవరు ఊహించని స్పెషల్ సర్ప్రైజెస్ రెడీ చేశారు. అఖండ, వీరసింహారెడ్డి వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య. ఇప్పుడు తన 108వ సినిమా కూడా కంప్లీట్ చేస్తున్నాడు.
స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య అభిమానులు ఎవరు ఊహించని స్పెషల్ ట్రీట్స్ రెడీ చేశారు. ఈ మేరకు రెండు రోజుల ముందు నుంచే సంబరాలు మొదలయ్యేలా ప్లాన్ చేశారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగాా ఆయన 108వ సినిమా టైటిల్ రివీల్ చేస్తున్నారు.
పుట్టినరోజుకు రెండు రోజులు ముందుగానే జూన్ 8న బాలయ్య 108 వ సినిమా నుంచి పవర్ఫుల్ టైటిల్ ప్రకటన రానుంది. బాలయ్య అభిమానులకు ఓ స్పెషల్ గిఫ్ట్ కింద ఈ టైటిల్ లాంచ్ జరగనుంది. బాలకృష్ణ పుట్టిన రోజున జూన్ 10న వీటన్నింటికి మించి అతి పెద్ద సర్ ప్రైజ్ ప్లాన్ చేశారట మేకర్స్. టైటిల్ లాంచ్ తో పాటు NBK108 ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్లతో నందమూరి అభిమానులకు గూస్బంప్స్ మోత మోగించనున్నారు.
ఈ సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు టాక్ ? పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాలో తనదైన మార్క్ కామెడీ జోడిస్తూ అనిల్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనుంది. థమన్ స్వరాలు అందిస్తున్నాడు.