“నేలకొండ భగవంత్ కేసరి..ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది”..తెలంగాణ యాసలో ఇరగదీసిన బాలయ్య(వీడియో)..!!

గ్లోబల్ లైన్ స్టార్ హీరో గా పాపులారిటి దక్కించుకున్న నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “NBK108”. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం కి రీసెంట్ గానే “భగవంత్ కేసరి” అనే టైటిల్ ని కంఫామ్ చేశారు. వీర సిమ్హా రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తరువాత బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై హ్యూజ్ ఎక్స్ పెక్స్టేషన్స్ నెల కొన్నాయి.

Balakrishna's Bhagavanth Kesari: Fierce First Look

ఈరోజు బాలయ్య పుట్టిన రోజు సంధర్భంగా కొద్ది సేపటి క్రితమే పవర్ఫుల్ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. చాలా తక్కువ టైం కలిగిన ఈ టీజర్ అభిమానులకు బాగా నచ్చేసింది. మరీ ముఖ్యంగా బాలయ్య ఉన్న మరో యాంగిల్ ని కూడా బయట పెట్టేశాడు అనిల్ రావిపూడి. కాగా బాలయ్య నోటి నుండి వచ్చిన పవర్ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిపోతున్నాయి అంటూ తెలిసిపోతుంది.

మరీ ముఖ్యంగా బాలయ్య తెలంగాణ యాసలో చెప్పిన “రాజు ఆని వెనక ఉన్న వందల మంది మందను చూపిస్తాడు ..అదే మొండోడు ఆయనకున్న ఒకే ఒక గుండెను చూపిస్తాడు” అంటూ తెలంగాణ భాషలో అదరగొట్టేశారు . అంతేకాదు సినిమాలో మాస్ ఫైట్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి అంటూ చిన్న టీజర్ తోనే రచ్చ రంబోలా చేసేసాడు అనిల్ రావిపూడి. దీంతో సోషల్ మీడియాలో కొద్దిసేపటికి రిలీజైన భగవంత్ కేసరి టీజర్ వైరల్ గా మారింది.

Balakrishna's First Look From #NBK108 Out

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా శ్రీలీల కూతురి పాత్రలో కనిపించబోతుంది. అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నారు. భగవంత్ కేసరి చిత్రాన్ని షైన్ స్క్రీన్స్‌ సినిమాస్ పతాకంపై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో మరోసారి బాక్స్ ఆఫిస్ ని షేక్ చేయబోతున్నాడు బాలయ్య అని ఫ్యాన్స్ బల్ల్ గుద్ది చెప్పేస్తున్నారు..!!