నటసింహం నందమూరి బాలకృష్ణను టాలీవుడ్‌కే గాడ్ ఆఫ్ మాస్‌గా పిలుస్తుంటారు. బాలయ్య కూడా తన సినిమాలలో మాస్ యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు.. ఇదే సమయంలో బాలయ్య తన కెరియర్ మొదటి నుంచి ఆయన తండ్రి ఎన్టీఆర్ చూపించిన ఆలోచనలు ఎక్కువగా ఉండేవి.. ఆ ప్రభావంతోనే బాలయ్య కు ఫ్యామిలీ ఇమేజ్ వచ్చింది.. ఎన్టీఆర్ ను ఇష్టపడిన వారంతా కూడా బాలయ్యలో ఎన్టీఆర్‌ను చూసుకునేవారు.. చిత్ర పరిశ్రమలో ఓ హీరోకి మాస్ ఇమేజ్ ఎంత ముఖ్యమో ఫ్యామిలీ ఇమేజ్ కూడా అంతే ప్రధానం.
బాలకృష్ణకి కూడా తొలి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ సినిమాతోనే అందుకున్నాడు.. ఆ సినిమా మారేదో కాదు మంగమ్మగారి మనవడు.. పల్లెటూరి వాతావరణం కథతో, ఉమ్మాడి కుటుంబాల భావోద్వేగాల కలగలిసిన ఈ సినిమాలో నిండైనా పంచెకట్టులో బాలకృష్ణ ప్రేక్షకులను అలంకరించడం. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి..సంవత్సరం పైగా ప్రేక్షకులను ఆలరించింది.
ఈ సినిమా తర్వాత ఆయన అనేక సినిమాలలో పల్లెటూరి వాతావరణం, కుటుంబ కథలు, సెంటిమెంట్ ప్రధానంగా చేసుకునే సినిమాల్లో నటించారు.. అలా వచ్చిన సినిమాలే .. మువ్వగోపాలుడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మేనల్లుడు, ముద్దుల మావయ్య, బంగారుబుల్లోడు, నారీ నారీ నడుమ మురారి, బొబ్బలి సింహం, వంశానికొక్కడు, పెద్దన్నయ్య.. వంటి సియిమలు బాలయ్యకు కుటుంబ ప్రేక్షకులు మంచి ఇమేజ్ను తీసుకొచ్చాయి.
ఈ సినిమాలతో బాలయ్య ఎన్టీఆర్ కొడుకుగా ఆయన పేరును నిలబెట్టాడు.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత బాలకృష్ణ ఈ కుటుంబ తరహా సినిమాలు చేయడంతో ఎన్టీఆర్ ను బాలకృష్ణలో చూసుకున్నారంటే అతిశయోక్తి కాదు. అచ్చ తెలుగుదనం ఉన్న కథలో నటించిన బాలకృష్ణ కు ఈ తరహా సినిమాలు అప్పట్లో ఆయనకు మంచి హిట్‌లు ఇచ్చాయి.
ఇక 90వ దశకం తర్వాత బాలకృష్ణ ఎక్కువగా ఫ్యాక్షన్ మాస్ సినిమాలని ఎక్కువ చేశారు.. అయితే ఆయన అలా నటించిన సినిమాలలో అంతర్లీనంగా సెంటిమెంట్, ఫ్యామిలీ కంటెంట్ సన్నివేశాలను ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నవారు. అలా వచ్చిన యాక్షన్ సినిమాల్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు కూడా ఈ తరహా సినిమాలుగా వచ్చి ఇండస్ట్రీ హిట్‌లుగా నిలిచాయి.
తండ్రి ఎన్టీఆర్ ఎంతటి మాస్ హీరో అయినా కూడా ఫ్యామిలీ కంటెంట్ ఎక్కువ ఉన్నా సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పించారు. బాలకృష్ణ కూడా తన కెరీర్ మొదటిలోనే కాదు ఇప్పటికీ కూడా ఆయన ప్రతి సినిమాలోను ఫ్యామిలీ సెంటిమెంట్‌కు ఎక్కువవ ప్రాధాన్యం ఇస్తున్నారు.. బాలయ్య లోని గొప్ప నటుడిని పరిచయం చేసిన వాటిలో ఫ్యామిలీ సినిమాలదే అగ్ర భాగం అని చెప్పాలి. ప్రస్తతం ఆయన నటిస్తిన్న సినిమాలో కుడా ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నారు.