నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో భైరవద్వీపం సినిమా కూడా ఒకటి. బాలయ్య తన కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే సీనియర్ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావుతో బాలయ్య చేసిన క్రేజీ వండర్ సినిమా భైరవద్వీపం. ఈ సినిమా ఎప్పటికీ కూడా ఓ కల్డ్ క్లాసిక్ సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది.
బాలయ్యకు జోడిగా అందాల తార రోజా హీరోయిన్గా నటించింది. అప్పట్లోనే ఈ సినిమా ఓ సంచలనం అయింది. సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో పాటు మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే భైరవద్వీపం సినిమాను ఆగస్టు 5 న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. 4k వెర్షన్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
ఈ విజువల్ వింటేజ్ వండర్ సినిమాను ఇప్పటి వరకు టీవీల్లోనే చూసి ఎగ్జైట్ అయ్యినవారు.. ఇక థియేటర్స్ లో చూడాలనుకుంటే ఇదొక మంచి అవకాశం అని చెప్పాలి. భైరవద్వీపం సినిమాలో రోజా హీరోయిన్ గా నటించగా కైకాల సత్యన్నారాయణ, పద్మనాభం, బాబు మోహన్ లాంటి దిగ్గజ నటులు నటించారు.