నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకు పోతున్నాడు. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి లాంటి రెండు బ్లాక్‌బస్టర్ హిట్లతో దూసుకు పోతున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా భగవంత్ కేసరి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా
నటిస్తున్న ఈ సినిమాలో మరో క్రేజీ హీరోయిన్ శ్రీలీల కూడా కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తుందన్న పుకార్లు అయితే వస్తున్నాయి. ఈ సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామాపై టాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భగవంత్ కేసరి సినిమా షూటింగ్ అయితే ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. దాదాపు చివరి దశకు వచ్చిందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ లేటెస్ట్ గా మాసివ్ అప్డేట్ అందిచారు.
ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. మేకర్స్ బాలయ్య పై ఓ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసి మరి సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ మెస్ట్ అవైటెడ్ సినిమా అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. అయితే అదే రోజు కోలీవుడ్ హీరో విజయ్ నటిస్తోన్న లియో కూడా రిలీజ్ అవుతోంది. అయితే అదే రోజు రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
బాలయ్య సినిమాపై మామూలు అంచనాలు లేవు. ఈ టైంలో లియో, టైగర్ నాగేశ్వరరావు రెండు సినిమాలే అదే రోజు వస్తే ఆ రెండు సినిమాలకు బాలయ్య సినిమా దెబ్బతో దబిడి దిబిడే. ఇక భగవంత్ కేసరి సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమాను షైన్ స్క్రీన్ సినిమాస్ నిర్మిస్తోంది.