మోక్షజ్ఞ విషయంలో నందమూరి అభిమానుల భయమిదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, నందమూరి కుటుంబాల నుంచి ఎవరైనా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటే కచ్చితంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్ తర్వాత పలువురు హీరోలుగా ఎంట్రీ ఇచ్చినా మరీ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకునే స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. నందమూరి ఫ్యామిలీలో సైతం సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో ఎవరూ సక్సెస్ సాధించలేదు.

నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో మోక్షజ్ఞ కచ్చితంగా సక్సెస్ సాధించడంతో పాటు స్టార్ స్టేటస్ ను నిలబెట్టుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దాదాపుగా 20 కిలోల బరువు తగ్గిన మోక్షజ్ఞ తన కొత్త లుక్ తో ఫ్యాన్స్ ను సంతోషపెడుతున్నారు. అయితే మోక్షజ్ఞ కొత్త లుక్ బాగానే ఉన్నా ఒక విషయంలో మాత్రం నందమూరి అభిమానులకు టెన్షన్ తగ్గలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బరువు తగ్గిన మోక్షజ్ఞ రాబోయే రోజుల్లో కూడా బరువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మళ్లీ బరువు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. స్లిమ్ లుక్ లో మోక్షజ్ఞ సింహంలా ఉన్నాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో మోక్షజ్ఞ యాక్టింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా మోక్షజ్ఞ నటన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

Balakrishna: కొడుకు మోక్షజ్ఞ సిని ఎంట్రీ విషయంలో చిరంజీవిని ఫాలో అవుతున్న  బాలకృష్ణ..? | NewsOrbit

మోక్షజ్ఞ మీడియాకు పూర్తిస్థాయిలో దూరంగా ఉండటం కూడా కొంతమంది ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. ఇకనైనా మోక్షజ్ఞ ఈ విషయంలో మారాల్సి ఉంది. తండ్రిని మించిన తనయుడిగా మోక్షజ్ఞ ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మోక్షజ్ఞ వయస్సు 28 సంవత్సరాలు.. కాగా వచ్చే సంవత్సరం తన పుట్టినరోజున మోక్షజ్ఞ తొలి సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. మోక్షజ్ఞ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.