నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఆయన అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ టీజర్‌తో పాటు, తన నెక్ట్స్ మూవీని కూడా అనౌన్స్ చేశారు. బాలయ్య నెక్ట్స్ మూవీని దర్శకుడు బాబీ తెరకెక్కించబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను కూడా చిత్ర యూని్ రిలీజ్ చేసింది.
ఇప్పుడు ఈ పోస్టర్‌కు సంబంధించి సోషల్ మీడియాలో పలు ఇంట్రెస్టింగ్ చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా స్టోరీ లీక్ అయ్యిందని.. బాలయ్య గతంలో నటించిన ఓ బ్లాక్‌బస్టర్ చిత్రానికి దీనికి చాలా పోలికలు ఉండబోతున్నాయనే టాక్ జోరుగా వినిపిస్తోంది. బాలయ్య నటించిన సమరసింహారెడ్డి సినిమా కథకు ఈ సినిమా చాలా దగ్గరగా ఉండబోతుందని.. ఈ సినిమాలోనూ బాలయ్య గతానికి సంబంధించి ఓ పవర్‌ఫుల్ కథ ఉండబోతుందని తెలుస్తోంది.
మొత్తంగా బాలయ్య వదిలిన ఈ కాన్సెప్ట్ పోస్టర్‌ను చూసి నెట్టింట దీనికి సంబంధించిన కథను కూడా నెటిజన్లు చెప్పేస్తుండటంతో మరోసారి బాలయ్య ట్రెండింగ్ అవుతున్నాడు. ఈ సినిమాలో బాలయ్య లుక్ పరంగా కూడా చాలా సరికొత్తగా కనిపిస్తాడని తెలుస్తోంది. మరి నిజంగానే బాలయ్య మరోసారి సమసరసింహారెడ్డి వంటి పవర్‌ఫుల్ కథతో వస్తే, బాక్సాఫీస్ వద్ద ఉన్న రికార్డులకు పాతరపడటం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.