వామ్మో.. బాలయ్య పెట్టుకునే విగ్గు అంత కాస్ట్లీనా..? స్పెషాలిటీస్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ గురించి తెలియని తెలుగువారు ఉండరు. నటరత్న ఎన్టీఆర్ నట వారసుడిగా టాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టి తన తండ్రికి తగ్గ కొడుకుగా భారీ క్రేజ్ అందుకుని ఆరుపదుల వయసులో కూడా యంగ్ హీరోలకు సమానంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు బాలయ్య. బాలకృష్ణ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. బాలయ్య సాధారణంగా విగ్గు పెట్టుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఇక్కడ బాలయ్య పెట్టుకునే విగ్గు ధర అక్షరాల 2ల‌క్ష‌ల‌ రూపాయలు ఉంటుందని ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ వాసు కొప్పిశెట్టి రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా బాలయ్య ధరించే విగ్గులు కూడా ఎంతో అరుదైనవని, అలాంటి విగ్గులని మన టాలీవుడ్ లో ఏ హీరో కూడా పెట్టుకోరని అంతటి ఖరీదైన విగ్గులు బాలయ్య తన సినిమాలు కోసం తప్పించుకుంటారని అందుకే బాలయ్య తన సినిమాలో విగ్గులు ధరించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారని తెలుస్తుంది.

సాధారణంగా ఆయనకు విగ్గులు ముంబై నుంచి తీసుకొస్తామని, ఒక్కోసారి చెన్నై నుంచి తీసుకొస్తామని, కొన్ని సందర్భాల్లో హైదరాబాద్‌లో కూడా దొరుకుతున్నాయని అన్నారు. నందమూరి బాలకృష్ణ చాలా అందగాడని ఆయన అందానికి కాస్త మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మా పనితనం ఏమీ లేదని వాసు చెప్పుకొచ్చారు. ఇక ఆయన అభిమానులు మాత్రం ఏ సినిమాలో అయితే బాలకృష్ణ కి విగ్గు కరెక్ట్ గా సెట్ అవుతుందో ఆ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అభిమానుల నమ్మకం.

అందుకే ఆయన తనకు సెట్ అయ్యే విగ్గులు మాత్రమే ఉపయోగిస్తారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో బాలకృష్ణ విగ్గు గురించి ఆసక్తికర విషయాలు వైరల్ కావడంతో నెటిజెన్లు బాల‌య్య‌ పెట్టుకునే విగ్గు అంత ఖరీదా అంటూ ఎంతో షాక్ అవుతున్నారు.