నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను వచ్చే దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇక అఖండ నుంచి బాలయ్య పూర్తిగా తన ట్రాక్ మార్చేసుకున్నాడు. మళ్లీ వింటేజ్ బాలయ్యగా ఇంట్రస్టింగ్ జానర్స్ ఎంచుకుంటూ సినిమాలు చేసుకుపోతున్నాడు.
ఈ క్రమంలోనే అఖండ, ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాలతో వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి తర్వాత వరుసగా మరింత మంది యంగ్ దర్శకులతో బాలయ్య వర్క్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్‌తో బాలయ్య వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇది చాలా ఇంట్రస్టింగ్ కాంబినేషన్. హిట్ సినిమా యూనివర్స్‌లో బాలయ్య కనిపించబోతున్నాడట. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను స్టార్ట్ చేసిన ఇంట్రెస్టింగ్ ఫ్రాంచైజ్ హిట్ సినిమా యూనివర్స్‌లో ఇప్పుడు బాలయ్య కనిపించనున్నాడని టాక్ ? బాలయ్యతో ఈ సీరిస్‌లో భాగంగా నాలుగో సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
ఈ క్రేజీ యూనివర్స్‌లో బాలయ్య లాంటి హీరో నటించడం అంటే అసలు ఆ ఊహే చాలా కొత్తగా ఉంది. ఈ సీరిస్‌లో నటించడం అంటే నెక్ట్స్ లెవల్ మాస్‌ను మనం చూడబోతున్నాం. అయితే ఇది ఎప్పుడు ఉంటుంది ? ఈ లోగా ఏం జరుగుతుంది ? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.