సీనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. తెలుగు ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉందంటే మెయిన్ పిల్లర్లలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ తండ్రికి తగ్గ నటుడిగా తెలుగులోనే స్టార్ హీరోగా ఉన్నాడు. ఎన్టీఆర్ నటించిన పలు హిట్ సినిమాలను కూడా రీమెక్ చేసి బాలయ్య నటించారు.
ఎన్టీఆర్ హీరోగా కమలకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన నర్తనశాల సినిమాను బాలకృష్ణ తన స్వీయ దర్శకత్వంలో ప్రారంభించారు. అదే సమయంలో సౌందర్య అకాల మరణంలో ఈ సినిమాను ఆపేశారు. రీసెంట్‌గా నర్తనశాల షూటింగ్ పూర్తయిన భాగాన్ని 2020 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తండ్రి వేసిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణదేవరాయలు, దుష్యంతడు, హరిశ్చంద్రుడు, వంటి ఎన్నో పాత్రలను బాలకృష్ణ పోషించి మెప్పించాడు. ఎన్టీఆర్ నటించిన ’వద్దంటే డబ్బు’ సినిమాను బాలయ్య కొద్దిగా మార్పులు చేసి జంధ్యాల దర్శకత్వంలో ‘బాబాయి అబ్బాయి’గా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఎన్టీఆర్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా ’రాముడు భీముడు’ . అదే టైటిల్‌తో కాస్త కొత్తగా అదే ‘రాముడు భీముడు’ టైటిల్‌తో తీశారు.
ఎన్టీఆర్, బాలకృష్ణ హీరోలుగా ద్విపాత్రాభినయం చేసిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా.. అప్పట్లో ఎన్టీఆర్ నటించిన ‘సత్య హరిశ్చంద్ర’, శకుంతలం’ సినిమాల రెండింటి స్టోరీలను కలిసి ‘బ్రహర్షి విశ్వామిత్రా’గా రీమేక్ చేసి ఎన్టీఆర్ తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’తో పాటు రావణాసురుడి కూడా నటించారు. బాలయ్య సత్య హరిశ్చంద్రుడిగా.. దుష్యంతుడిగా రెండు పాత్రల్లో నటించారు.
ఈ సినిమా ఎన్టీఆర్, బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ ఆల్ టైమ్ డిజాస్టర్‌గా నిలిచింది. భైరవ ద్వీపం- బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో వచ్చిన ‘భైరవ ద్వీపం’ సినిమా ఎన్టీఆర్ నటించిన ‘పాతాళ భైరవి’తో పాటు ‘గులేబకావళి కథ’, ‘జగదేకవీరునికథ’, ‘రాజపుత్ర రహస్యం’ వంటి నాలుగు సినిమాల కథలను కొద్ది కొద్దిగా తీసుకొని ‘భైరవ ద్వీపం’ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ల్లో ఒకటిగా నిలిచిపోయింది.
కమలాకర కామేశ్వరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘పాండురంగ మహత్యం’ సినిమాను కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘పాండురంగడు’గా రీమేక్ చేసారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీకృష్ణ పాండవీయం’ సినిమాలో కొంత భాగాన్ని బాలయ్య.. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో ‘శ్రీకృష్ణార్జున విజయం’గా రీమేక్ చేసారు.
సీనియర్ ఎన్టీఆర్ శ్రీరామచంద్రుడిగా నటించిన అలనాటి క్లాసిక్ ‘లవకుశ’ సినిమాని బాలకృష్ణ.. బాపు దర్శకత్వంలో ‘శ్రీరామరాజ్యం’గా రీమేక్ చేసారు ఇక అది సూపర్ హిట్ అయ్యింది. బాలయ్య ఇందులో పూర్తి స్థాయిలో శ్రీరాముడి పాత్రలో నటించాడు. బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవితంపై ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ సరైన విజయం అందుకోలేకపోయాయి.