బాలయ్య కూతురు బ్రాహ్మిణి కి ఆ హీరో అంటే అంత ఇష్టమా..? మేడమ్ టేస్ట్ సూపరో సూపర్..!!

టాలీవుడ్ లోనే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్న నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి తో భగవంత్‌ కేసరి సినిమా చేస్తున్నాడు. అలాగే తన 109వ సినిమాని కూడా మెగా దర్శకుడు బాబి తో చేస్తున్నాడు. ఇదే సమయంలో బాలయ్య పెద్దకూతురు నారా బ్రాహ్మణి గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఈమె సొంతం. తనకంటే పెద్దవారిని గౌరవించే హుందాతనం, చదువులో గోల్డ్ మెడలిస్ట్.. ప్రస్తుతం హెరిటేజ్ సంస్థలను తన భుజాలపై వేసుకుని ముందుకు నడిపిస్తున్న బాలయ్య పెద్ద కూతురు.. నారా చంద్రబాబు నాయుడు ఇంటికి కోడలిగా వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే.

బ్రాహ్మణి పెళ్లికి ముందు హీరోయిన్‌గా ఎన్నో అవకాశాలు వచ్చినా సరే సినిమాలపై ఆసక్తి లేకపోవడంతో వాటిని రిజెక్ట్ చేసింది. బాలయ్య తన కూతుర్లను వారికి ఇష్టం లేని పనిచేయటం అలవాటు లేదు. ఇక ఈ సమయంలోనే చదువు, కెరీర్, లైఫ్ సెటిల్ అన్ని విషయంలోనూ కూతుర్లకే వదిలేసాడు బాలయ్య. అందుకే ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉండే బ్రాహ్మణి సినిమాలను కూడా ఎంతో తక్కువగా చూస్తూ ఉంటుందట. మరీ ముఖ్యంగా తన తండ్రి బాలకృష్ణ సినిమాలను మాత్రం ఎక్కువగా చూస్తుందని.. లవ్ రొమాంటిక్ సినిమాలు బ్రాహ్మణికి పెద్దగా ఇష్టం ఉండదని తెలుస్తుంది.

అయితే ఇదే సమయంలో బ్రాహ్మిణికి ఇష్టమైన హీరో ఎవరు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. బ్రాహ్మణికీ తన తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నటన అంటే ఎంతో ఇష్టమట. అంతే కాకుండా ఇప్పటికీ ఆయన సినిమాల టీవీలు వస్తే మాత్రం క్రమం తప్పకుండా ఆ సినిమాలు చూస్తుందట. మరీ ముఖ్యంగా వారి తాతగారు నటించిన దానవీరశూరకర్ణ సినిమా అంటే బ్రాహ్మణికి ఎంతో ఇష్టమట. ఆ తర్వాత అంతగా బాగా నచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ అనే అంటూ తెలుస్తుంది. తాత‌ ఎన్టీఆర్ తర్వాత తండ్రి బాలకృష్ణ నటన ఎక్కువగా ఇష్టపడుతుందట బ్రాహ్మణి. ఆ తర్వాత తన అన్న జూనియర్ ఎన్టీఆర్ ని ఎక్కువగా లైక్ చేస్తుందట. దీంతో ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.