‘ బాల‌య్య వీర‌సింహా ‘, ‘ చిరు వీర‌య్య ‘ రెండూ డ‌బుల్ సెంచ‌రీలు కొట్టేశాయ్‌..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలు అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేర్లు మెగాస్టార్ చిరంజీవి, నట‌సింహం నందమూరి బాలకృష్ణ. ఈ ఇద్ద‌రి సినిమాలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే పైట్ మరో లెవల్లో ఉంటుంది. అదే సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య సినిమాల పోటీ అంటే మామూలుగా ఉండదు. ఈ సంక్రాంతికి కూడా ఈ సీనియర్ స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో తలపడ్డారు

చిరు వాల్తేరు వీరయ్యగా రాగా, బాల‌య్య వీర సింహారెడ్డితో వ‌చ్చాడు. ఇక ఈ రెండు సినిమాలను కూడా ఒకే ప్రొడక్షన్స్ హౌస్ నుంచి వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యాయి. అంతే కాకుండా భారీ వసూళ్లు రాబట్టి వారి కెరీర్ లోనే ద బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటిగా ఈ సినిమాలు స్థానాన్ని సంపాదించుకున్నాయి. తాజాగా ఈ రెండు సినిమాలు మరో క్రేజీ రికార్డును త‌మ ఖాతాలో వేసుకున్నాయి. 200 డేస్ భారీ రన్ కంప్లీట్ చేసుకొని మరో రికార్డును సృష్టించాయి.

గడిచిన 2,3 రోజుల్లో ఈ రెండు సినిమాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి 200 రోజుల భారీ రన్ ని పూర్తి చేశాయి. వీర‌సింహారెడ్డి ఆళ్ళూరులో ఈ సెన్సేషనల్ రికార్డును కంప్లీట్ చేయగా.. వాల్తేరు వీరయ్య అవనిగడ్డలో ఈ రికార్డును కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బాలయ్య , చిరు ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు.