నట‌సింహం బాలయ్యకి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా..ఫ్యాన్స్ అయిన సరే అసలు గెస్ చేయలేరు..!!

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ సీనియర్లలో టాప్ హీరో నందమూరి బాలకృష్ణ. అలాగే తెలుగులో నటవారసుల్లో టాప్ హీరో అనిపించుకున్న తొలి హీరో కూడా. స్టార్ హీరో కొడుకుగా పుట్టినంత మాత్రాన స్టార్ కాలేరు. ఎదో ఒక ప్రత్యేకత, అందం, అభినయం లేకపోతే ప్రేక్షకులు మెప్పించ‌లేరు. అలాంటి ఓ లెజెండ్ నందమూరి తారకరామారాము కడుపున పుట్టి, తండ్రికి తగ్గ తనయుడుగా అనిపించుకున్నాడు నటసింహం బాలకృష్ణ.

పద్నాలుగేళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వ‌చ్చిన‌ ‘తాతమ్మ కల’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన న‌ట‌సింహం. కేరీర్ మొద‌టిలో సహాయ నటుడిగా తండ్రి సినిమాల్లో నటించిన బాలకృష్ణ, తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి 12 సినిమాల్లో న‌టించాడు బాలకృష్ణ. హీరో అయిన తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వంలో శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్రా సినిమాల్లో నటించారు బాలయ్య.

అయితే మొదటి నుంచి కూడా బాలయ్య హెల్త్ విషయంలో కేర్ ఎక్కువగా తీసుకుంటారు. అందుకే ఈ వయసులో కూడా ఎంతో ఫిట్ గా ఉన్నారు. ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ కి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా..?బాలయ్యకి ఇష్ట‌మైన ఫుడ్ రొయ్యలను ఎంతో ఇష్టంగా తింటారట. అలాగే చికెన్ బిర్యానీని కూడా బాలయ్య ఇష్టపడి తింటారట. బాలయ్య తో పాటు చాలామంది టాలీవుడ్ హీరోలకు బిర్యానీనే ఫేవరెట్ ఫుడ్.. సెలబ్రిటీస్ కే కాదు చాలా మందికి బిర్యానీనే ఫేవరెట్ ఫుడ్.

ఇప్పటికే టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి తో భగవంత్‌ కేసరి చేస్తున్నాడు. ఈ సినిమా కూడా దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయం అందుకోవాలని బాలయ్య ఫుల్ జోష్ మీద ఉన్నాడు. అదేవిధంగా ఈ సినిమా కంప్లీట్ అవగానే తన 109వ‌ సినిమాను మెగా దర్శకుడు బాబి తో ఇప్పటికే మొదలుపెట్టాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ విధంగా టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలకు పోటీగా బాలయ్య వరుస‌ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు