అవేకళ్లు సినిమా అప్పట్లో సూపర్ హిట్. దాదాపు 2 గంటల 50 నిమిషాల సినిమా. వివాహేతర సంబంధాలతో పుట్టిన యువకుడు.. తన కుటుంబంపైనే కక్ష తీర్చుకునే కథతో తీసిన కథ ఇది. ఈ హత్యలు ఎలా జరుగుతున్నాయో.. తెలియక.. కుటుంబంలోని వారే.. ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకునే ఇతివృ త్తంతో తెరకెక్కిన ఈ సినిమా.. విజయవాడ దుర్గా కళామందిరంలో 100 రోజుల పండగ చేసుకుంది.
అయితే.. ఒకరు ఈ సినిమా చూస్తూ.. చనిపోయారనే వార్త అప్పట్లో సంచలనంగా మారింది. దీనిపై హీరో కృష్ణ తీవ్రంగా బాధపడ్డారు. అయితే.. వైద్యులు మాత్రం.. సినిమా వల్ల కాదని రిపోర్టు ఇచ్చా రు. ఇదిలావుంటే.. ఈ సినిమాలో మొదట కృష్ణ కుమారిని హీరోయిన్‌గా అనుకున్నారు.కానీ, కొన్ని కారణాలతో ఆమె ఒప్పుకోలేదు.
దీంతో ఆమె ప్లేస్‌లో కాంచనను హీరోయిన్‌గా చేసుకున్నారు. బాగా నటించింది. కానీ, రెమ్యునరేషన్ విషయంలో ఆమె వివాదానికి దిగారు. అనుకున్న షెడ్యూళ్ల కంటే కూడా.. రెండు ఎక్కువ చేశానని నిర్మాతతో వాదనకు దిగి.. రచ్చ చేశారు. దీంతో హీరో కృష్ణ జోక్యం చేసుకుని.. ఆ రెమ్యునరేషన్‌ను తానే ఇచ్చారు. ఇక, ఆ తర్వాత నుంచి కృష్ణ తన సినిమాల్లో కాంచనను తీసుకోక పోవడం గమనార్హం.
ఇది ఒక్క అవేకళ్లు సినిమాకే కాకుండా.. అనేక సినిమాల్లో కాంచన ముందు ఒప్పుకొన్న దానికి తర్వాత.. డిమాండ్ చేసిన మొత్తానికి.. తేడా ఉండేది. దీంతో కాంచనకు అవకాశాలు తగ్గిపోయాయని అప్పట్లో ఒక చర్చ అయితే నడిచింది. ఏదేమైనా అవేకళ్లు సినిమా అయితే.. హిట్టయినా.. ఈ సినిమాలో కాంచన పాత్రకు పెద్దగా పేరు రాకపోవడం గమనార్హం.