తెలుగు లో కాకుండా ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్ర పోషించిన భాషలు ఏంటో తెలుసా ?

ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా వల్ల చాలామందికి నిజమైన పురాణాలపై ఆసక్తి కలిగింది. అసలైన చరిత్ర ఏంటి దాన్ని ఎంత దారుణంగా ఈ చిత్రంలో వక్రీకరించారు అనే విషయంపై నేటిజన్స్ కి ఒక రకమైన అవగాహన కలిగింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రభాస్ ఆది పురుష్ సినిమా సంగతి కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం ఏ పురాణాలలో అయిన, ఎలాంటి పాత్ర అయిన నటించాలి అంటే అది కేవలం సీనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమని అందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు. మన తెలుగు వారికి తెలిసిన ఏకైక రాముడు మరియు కృష్ణుడు కేవలం అన్నగారు నందమూరి తారక రామారావు గారు మాత్రమే.

Sr.N. T. Rama Rao Mythological Movies | Sr NTR Telugu Mythological Films

శ్రీకృష్ణుడి పాత్రకు, రాముడి పాత్రకు న్యాయం చేయగలరు చాలామంది తెలుగు హీరోలు అలా నటించాలని ప్రయత్నించినా కూడా ఆయన స్థాయికి ఎవరు అందుకోలేక పోయారు. అయితే శ్రీకృష్ణుని పాత్ర విషయానికి వస్తే ఎన్టీఆర్ కేవలం తెలుగులోనే కాదు మిగతా భాషల్లో కూడా కొన్నిసార్లు ఎన్టీఆర్ తప్ప మరెవ్వరూ ఆ పాత్రకు న్యాయం చేయలేదు అని కొంతమంది భావించారు. అలా ఎన్టీఆర్ తెలుగులో కాకుండా వేరే భాషల్లో ఎన్ని సార్లు శ్రీకృష్ణ పాత్రలో నటించారో, ఆ సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

NTR: The Star Who Became A God

సాధారణంగా మన తెలుగు దర్శకులు మాత్రమే ఎక్కువ సార్లు పురాణాలపై సినిమాలు తీశారు. ఎన్ని సార్లు తీసినా కూడా, ఎంత వక్రీకరణ జరిగినా కూడా ఆ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు సైతం ఆదరిస్తూ వచ్చారు. అయితే అడపా దడప మిగతా భాషల్లో కూడా కొన్ని సార్లు పురాణాలపై ఆసక్తితో చిత్రాలు తీయడం జరిగింది ముఖ్యంగా తమిళ్ లో మనం ఈ రకమైన ఒరవడిని గమనించవచ్చు. దాదాపు 60 సంవత్సరాల క్రితం అంటే 1964లో తమిళ్ లో కర్ణ అనే చిత్రం వచ్చింది. కర్ణ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించింది అంటే తమిళ సినిమా చరిత్రలో అదొక మైలురా ఇలాంటి చిత్రం ఈ సినిమా టైటిల్ రోల్ శివాజీ గణేషన్ పోషించారు.

Book excerpt: Behind the scenes of NTR's attempt to make a film as Andhra  Pradesh chief minister

కర్ణుడి సినిమా వస్తుంది అంటే అందులో శ్రీ కృష్ణుడు లేకపోతే ఎలా చెప్పండి. మరి శివాజీ గణేశన్ కర్ణుడి పాత్రకు ఓకే కానీ కృష్ణుడి పాత్ర పోషించే దమ్ము తమిళ్ లో ఎవరికి ఉంది అనే చర్చ వస్తే ఏ ఒక్కరు కూడా లేరని అందుకు తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ మాత్రమే అని నిర్ధారణకు వచ్చారు. దాంతో ఎన్టీఆర్ ని కర్ణ సినిమా కోసం అడగగా ఆయన కూడా ఒప్పుకొని నటించారు. ఇక శ్రీకృష్ణుడి పాత్ర సినిమా పూర్తిగా ఉండే మరొక తమిళ సినిమా కన్నన్ కరునై. ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ శ్రీ కృష్ణుడు పాత్రలో నటించారు. నార్త్ ఇండియన్స్ కి ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుడి పాత్రతో అనేక సినిమాలు వచ్చినప్పటికీ కేవలం ఎన్టీఆర్ తప్ప ఆ పాత్రకు మరే నటుడు కూడా న్యాయం చేయలేదు.