చిత్ర పరిశ్రమకు హీరోయిన్లు వచ్చేది డబ్బు కోసమే అన్న విషయం అందరికీ తెలిసిందే.. డబ్బు సంపాదించుకోవడం కోసం ఎన్నో రకాలుగా బాధలు పడి.. కడుపునిండా అన్నం తినకుండా జీరో సైజ్ మెయింటైన్ చేస్తూ ముఖానికి రంగులు పూసుకొని ఇష్టం లేని పాత్రలో కూడా నటిస్తూ ఉంటారు. కొంతమంది హీరోయిన్లు మాత్రం సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటి నుంచి కనుమరుగైపోయే వరకు ఎక్కువగా సంపాదన గురించి ఆలోచిస్తూ ఉంటారు.
మరి కొంతమంది భామలు మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రత్యేకంగా ఉండడానికి ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో బబ్లి బ్యూటీ అనుష్క శెట్టి కూడా ఒకరు. పరిశ్రమలోకి అడుగుపెట్టి ఈమె కొన్ని దశాబ్దల కాలమే దాటేస్తుంది .. అయినా సరే తెలుగులోనే టాప్ హీరోయిన్గా ఉంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకుంది.
అనుష్క శెట్టి హైట్ కి వెయిట్ కి ఆమె టాలెంట్ కి బాలీవుడ్ నుంచి కూడా ఎన్నో బడా బడా ఆఫర్లు వచ్చాయట . కానీ అనుష్క శెట్టి ఒక కారణంతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేయడానికి అసలు ఒప్పుకోలేదంటూ ఓ వార్త బయటకు వచ్చింది. బాలీవుడ్ సినిమాల్లో బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాల్లో ఎక్కువ నటించాలని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేముందు అలాంటి పాత్రలు చేయక్కర్లేదు అంటూ చెప్పుకొచ్చిన ..తర్వాత హీరోయిన్లతో విచ్చలవిడిగా హద్దులు మీరి ..వారితో అలాంటి ప్రయత్నాలు చేయిస్తారని.. ఆ కారణంగానే బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి అనుష్క వెళ్లడం లేదు” అంటూ ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక దీంతో సోషల్ మీడియాలో అనుష్క పేరు మరోసారి మారుమ్రోగిపోతుంది. ఇక ప్రస్తుతం అనుష్క శెట్టి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” అనే సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమా కూడా వచ్చే నెల 4 తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాతో అయినా హిట్ అందుకొని అనుష్క తన కెరీర్ లో మళ్ళీ ఫామ్ లోకి వస్తుందని ఆమె అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు..!!