అబ్బబ్బా.. ఇది కదా ప్రభాస్ అభిమానులకు కావాల్సింది . ఇన్నాళ్లు ప్రభాస్ పెళ్లెప్పుడు చేసుకుంటాడా..? అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్ త్వరలోనే రాబోతుంది అంటూ ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న రెబెల్ హీరో ప్రభాస్ త్వరలోనే అభిమానులకి ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అయితే అది పెళ్లి గురించి అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. కానీ అభిమానులకు గుడ్ న్యూసే..
పెళ్లి గురించి కాదు ..కానీ అభిమానులకు గుడ్ న్యూస్ ఏంటబ్బా అనుకుంటున్నారా..? ఎస్ అదే ప్రభాస్ – అనుష్క జంటగా మరో సినిమా తీయబోతున్నారు . ఇప్పటికే ఈ జంట జనాల్లో ఎంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీళ్ళు కలిసి నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది . అంతేకాదు ప్రెసెంట్ ఈ జంట పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది కోట్లాదిమంది అభిమానులు కళ. త్వరలోనే అది కూడా జరగబోతుంది అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు .
కాగా ప్రెసెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ తన జాన్ జిగిడి దోస్త్ అయిన డైరెక్టర్ వరుస ఫ్లాప్ లతో ఉండడంతో అతగాడి కెరీర్ కు ఊపునివ్వడానికి ప్రభాస్ -అనుష్క సిద్ధపడ్డారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అంతే కాదు ఈ సినిమాలో ప్రభాస్ అనుష్క భార్య భర్తలుగా కనిపించబోతున్నారట. రీల్ లైఫ్ లో భార్యాభర్తలు గా మారుతున్న ప్రభాస్ – అనుష్క రియల్ లైఫ్ లో కూడా మారాలి అంటూ అభిమానులు ఆశపడుతున్నారు.
ఇప్పుడు ఈ గుడ్ న్యూస్ అందించిన ఈ జంట త్వరలోనే మరో గుడ్ న్యూస్ కూడా అందించేస్తే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు. త్వరలోనే ఈ జంట ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా చేయబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. కచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాస్తుంది అనడంలో సందేహం లేదు అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ . చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి క్రేజీ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో..?