ప్రభాస్‌పై ప్రేమని మరోసారి బయటపెట్టిన అనుష్క.. ఆమె చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా…!

చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలిచే వార్తల్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్, అనుష్క శెట్టిల‌ మధ్య నడుస్తున్న ప్రేమాయణం అనే చెప్పాలి. వీరిమధ్య ప్రేమ ఉందో లేదో.. ఎప్పుడు పుట్టిందో.. ఎవరికీ తెలియదు కానీ వీరు పెళ్లి చేసుకుంటే చూడాలని మాత్రం కోట్లాదిమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. వారు కోరుకున్నది నెరవేరుతుందో వారి కలగానే ఉండిపోతుందో అనేది త్వరలోనే తెలుస్తుంది.

ఇదే సమయంలో అనుష్క మాత్రం చాలాసార్లు ప్రభాస్ పై తనకున్న ఇష్టాన్ని ప్రేమని ఎన్నో రకాలుగా చూపిస్తూనే వచ్చింది. కాగా రీసెంట్గా మరోసారి అనుష్క చేసిన ప‌ని ప్రభాస్ అంటే ఆమెకు ఎంత ఇష్టమో మరోసారి తేల్చి చెప్పేశాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం అందరూ ఆదిపురుష్‌ సినిమాని ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. రాముడుగా ప్రభాస్ అసలు పనికిరాడు అంటూ ఆయన్ని బండ బూతులు తిడుతున్నారు.

ప్రభాస్‌ను ఇంత దారుణంగా ట్రోలింగ్ చేయడం అనుష్కకు ఆస‌లు నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసే వారీకి తనదైన రీతిలో ఇచ్చి పడేసిందట. రామాయణం లాంటి కథలో హీరోగా చేయాలి అంటే గట్స్ ఉండాలి.. డేర్‌ ఉండాలి.. అప్పుడే హీరోగా ఆ పాత్ర చేయగలం. అవన్నీ ప్రభాస్ దగ్గర మాత్రమే ఉన్నాయి.. నిజానికి రాముడు పాత్రలో ప్రభాస్ ఎంతో ? ఒదిగిపోయాడు తన నటనతో మరో మెట్టు ఎక్కాడు కానీ ఆ పాత్రను ఏమి తగ్గించలేదు.

ఇలాంటి సమయంలో అందరూ ఇలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ విధంగా ట్రోల్ చేసే వాళ్ళు ఒకసారి ఆ పాత్ర పోషించి చూస్తే వారికి తెలుస్తుంది. ఆ బాధ ఏంటో కష్టమేమిటో అర్థమవుతోంది. ప్రభాస్‌కి అండగా నిలుస్తూ ఆయనని ట్రోల్ చేసే వారికి అదిరిపోయే రీతిలో కౌంటర్ ఇచ్చింది అనుష్క‌. ఇక ఇప్పుడు దీంతో మరోసారి వీరి మధ్య ప్రేమ నడుస్తుందని వార్త వైరల్ గా మారింది.