అన్నగారు ఏం చెప్పినా అక్కినేని రిజెక్ట్ చేశారా ఈ విషయం సినీ రంగంలో చాన్నాళ్లపాటు హల్చల్ చేసింది. అన్నగారు ఎన్టీఆర్‌కి అక్కినేని నాగేశ్వరరావుకి మధ్య అవినాభావ సంబంధం ఉంది. అన్నదమ్ములు ఏ విధంగా అయితే ఉంటారో సినిమా రంగంలో అక్కినేని నాగేశ్వరరావు అన్న ఎన్టీ రామారావు కూడా అదే విధంగా ఉండేవారు. ఇప్పుడు కూడా వారి పిల్లలు అన్నదమ్ములు గానే వ్యవహరిస్తుంటారు.
అయితే అక్కినేనిని తీసుకున్నట్లయితే అన్నగారితో పోల్చుకుంటే అక్కినేని సహసాలు చేయడానికి ఇష్టపడేవారు కాదు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం ఏ రోజు రాలేదు. అదేవిధంగా సంగీతం వైపు రాలేదు. నిర్మాతగా ఒకసారి సినిమాలు తీసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ పెట్టిన తర్వాత మెజారిటీ సినిమాలు వేరే వారికి ఇచ్చే ప్రయత్నాలు చేశారు. అన్నపూర్ణ సినీ స్టూడియోస్ మీద సినిమాలు చాలా చాలా ఆలోచించి తీసేవారు. సంవత్సరానికి ఒకటి తీస్తే ఎక్కువ అన్నట్టుగా ఆ రోజుల్లో ఉండేది.
ఆర్థికంగా జాగ్రత్తగా కావచ్చు లేకపోతే ఆర్టిస్టులు పెట్టేటటువంటి సమస్యలు కావచ్చు. వాటిని పెద్దగా సాహసం చేయడానికి ఇష్టపడేవారు కాదు. ఇక, అన్నగారు అలా కాకుండా సహాసానికి పెద్ద పీఠం వేసేవారు. ఈ క్రమంలోనే అన్నగారు తీసినటువంటి సినిమాల్లో అక్కినేని పాత్రలు ఇవ్వటానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అక్కినేని నటించడానికి ముందుకు రాకపోవడానికి కారణాలు తెలీదు గానీ ఆయన గారి సినిమాల్లో పెద్దగా నటించలేదని చెప్పాలి.
ముఖ్యంగా దానవీరశూరకర్ణ సినిమాకి వచ్చేసరికి అన్నగారు చాలా రోజులు అక్కినేనికి ఫోన్లు మీద ఫోన్లు చేసి నటించమని కోరారు. ప్రధానంగా అక్కినేనితో ఆయన వేయించాలనుకున్నటువంటి పాత్రలు రెండు ఒకటి కృష్ణుడు లేదా దుర్యోధనుడు. ఈ రెండు పాత్రలని నటించమని అన్నగారు కోరారు. ఈ రెండు పాత్రలు ప్రధానంగా దానవీరశూరకర్ణలో కర్ణుడి పాత్రను నేను చేస్తున్నాను. ఇది హీరో కాబట్టి కృష్ణుడు పాత్రను మీరు చేయండి అని చెప్పి కోరారు.
కానీ, అక్కినేని చేయలేదు. అదేవిధంగా దుర్యోధనుడు పాత్ర చేయమని అడిగారు. అదీ చేయనన్నారు. పోనీ అర్జునుడు పాత్ర చేయమన్నారు అది చేయనని చెప్పారు. దీనికి కారణం మీరు నటించిన తర్వాత మీ కంటూ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత మళ్లీ నేను నటించి ఆ పాత్రకి అన్యాయం చేసినట్టు అవుతుంది ప్రేక్షకులు నన్ను తిడతారు. అనేటటువంటిది అక్కినేని మాట. మొత్తంగా చూసినట్లయితే అన్నగారు ఎంత ఒప్పించాలి అనుకున్నా దానవీరశూరకర్ణ సినిమా విషయానికి వచ్చేసరికి ఒప్పించలేకపోయారని చెప్పారు.
దీంతో అన్నగారు అప్పటిదాకా వేచి ఉండి కృష్ణుడి పాత్ర దుర్యోధనుడు పాత్రలు కూడా తానే నటించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అన్నగారు ప్రతి ఫ్రేమ్లోనూ కనిపించినప్పటికీ కూడా ప్రతి పాత్రని కూడా చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దునటువంటి తీరు చాలా అద్భుతం. ప్రతి డైలాగ్ కూడా అమోఘం ప్రతి డైలాగ్ కి చప్పట్లు మార్మోగాయి. దీంతో ఆ సినిమా 365 రోజులు పాటు ఆడింది.