ANR ఆ స్టార్ హీరోయిన్ ని ప్రేమించారనే విషయం మీకు తెలుసా.. వారి మధ్య అంత జరిగిందా..!?

మన తెలుగు చిత్ర పరిశ్రమకు భారతదేశంలో భారీ గుర్తింపు తెచ్చిన మొదటి తరం హీరోలలో నటరత్న ఎన్టీఆర్, ఏఎన్నార్ ముందు వరుసలో ఉంటారు. అందులో అక్కినేని నాగేశ్వరరావు గురించి మనం చెప్పాలంటే ఆ రోజుల్లోనే నాగేశ్వరావుకు ఎందరో లేడీ అభిమానులు ఉండేవారు. అంతేకాకుండా ఆయన చాలామందికి కలల రాకుమారుడు గా ఉండేవారు. కేవలం అభిమానులే కాకుండా హీరోయిన్లు కూడా ఈయనకు ఎంతో ఫాలోయింగ్ ఉండేది. ఇక ఈ విషయం ఇలా ఉంచితే గతంలో నాగేశ్వరరావు- సావిత్రి ప్రేమలో ఉన్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీరి మధ్య ప్రేమ ఉందని వార్త బయటకు రావడానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అక్కినేని నాగేశ్వరరావు- సావిత్రి కలిసి అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించారు. అంతేకాకుండా ఒకానొక సమయంలో నాగేశ్వరరావు- సావిత్రి డేట్స్ మొత్తం దాదాపు మూడు సంవత్సరాల పాటు తనతోనే లాక్ చేసుకున్నారు. ఆ రోజుల్లో హీరోయిన్లు తక్కువగా ఉండేవారు కాబట్టి అలా ఆయన చేశారట. అంతేకాదు వీరిద్ద‌రు కలిసి నటించిన దేవదాస్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందె. అలాగే ఈ సినిమాతోనే వీరి మధ్య ఎఫైర్ నడిచిందని వార్తలు గట్టిగా వినిపించాయట.

ఇక అదే సమయంలో స్వయంగా ఎన్టీఆర్ వచ్చి సావిత్రిని నా సినిమా కోసం డేట్స్ ఇవ్వమ్మా అంటే కూడా లేదండి మొత్తం ఏఎన్ఆర్ గారే లాక్ చేశారు అని చెప్పేదట. అయితే ఏఎన్ఆర్ సావిత్రి డేట్స్ ని అలా లాక్ చేయడం వల్లే మిగతా హీరోలతో సావిత్రి ఎక్కువ సినిమాల్లో నటించలేదట. అంతే కాదు సావిత్రి చివ‌రి రోజుల్లో ఆమె దుర్బర స్థితి అనుభవించినప్పుడు సావిత్రిని ఎన్టీఆర్, శివాజీ గణేషన్ లాంటి హీరోలు పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం కూడా ఆమె వారికి డేట్స్ ఇవ్వకుండా ఏఎన్ఆర్ తో సినిమాలు చేయడమే అని చాలామంది అప్పట్లో సినీ విశ్లేషకులు భావించారు. ఇక సావిత్రి జెమినీ గణేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. కానీ అప్పట్లో సినీ విశ్లేషకులు మాత్రం ఏఎన్ఆర్ చేసిన పనికి వాళ్ళిద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉందని భావించారు.