మ‌రో నంద‌మూరి హిట్ … చైత‌న్య‌కృష్ణ ‘ బ్రీత్‌ ‘ కు సూప‌ర్ టాక్‌..!

సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. డైలాగ్ డెలివరీ అంటే ముందుగా గుర్తొచ్చేది నందమూరి కుటుంబమే. ఆ కుటుంబంలో ఎవరు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందరి కళ్ళు వారి మీదే ఉంటాయని అందరికి తెలిసిందే. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టిఆర్ తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఉన్నారు.

అయితే ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వటానికి రెడీ అవుతున్నారంట. ఇప్పటికే నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. అయితే మరో హీరో కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. నందమూరి జయకృష్ణ తనయుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనున్నాడు. చైతన్య కృష్ణ నటించిన బ్రీత్ మూవీ నుంచి తాజాగా టీజర్ కూడా రిలీజ్ అయ్యింది.

ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో రిలీజ్ చేసిన ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఈ సినిమాలో చైతన్య కృష్ణ రొటీన్ కు భిన్నమైన పాత్రలో కనిపిస్తున్నారు. వైద్యో నారాయణో హరి అనే ట్యాగ్ లైన్ తో బ్రీత్ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ కావడం గమనార్హం. ఈ సినిమా మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతుంది.

మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు నందమూరి జయకృష్ణ పేరు నిర్మాతగా ఉండగా వంశీకృష్ణ ఆకెళ్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బడ్జెట్ విషయంలో ఏ మాత్రం తగ్గలేదు.

ఈ సినిమలో చైతన్య కృష్ణకు జోడీగా ఈ సినిమాలో వైదిక సెంజలియా నటించారు. మార్క్ కే రాబిన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. త్వరలోనే ఈ సినిమాలో రిలీజ్ డేట్ ను చెప్పనున్నారు. నందమూరి కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.