సాధారణంగా ఏ హీరోయిన్ అయినా.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తారు. సాధ్యమై నంత మంది అభిమానులను పోగేసుకునేందుకు ప్రయత్నిస్తారు. సావిత్రి.. అంజలీదేవి.. వంటివారు ఇలానే అనేక మంది అభిమానులను సంపాయించుకున్నారు. సావిత్రి అయితే.. అభిమాన సంఘాలను ప్రోత్సహించేవారు. “హీరోలేనా ఏమిటి.. హీరోయిన్లకు మాత్రం సంఘాలు ఉండద్దా“ అని ప్రశ్నించేవారు.
ఇలా.. సావిత్రి.. అటు తమిళనాట, ఇటు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోనూ అభిమానులను ఎక్కువగానే పోగే సుకున్నారు. ఇక, తమిళనాడులో అయితే.. సావిత్రికి అప్పట్లో గుడులు కడతామనికొందరు ముందుకు కూడా వచ్చారు. అయితే.. అప్పటి ప్రభుత్వంతో ఉన్న రాజకీయ వివాదాల కారణంగా.. సావిత్రి గుడులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే.. తమిళనాడులో ప్రతి జిల్లాలోనూ ఒక గుడి ఉండేది.
ఇక, అంజలీదేవి కూడా అభిమానులను ప్రోత్సహించినా.. సావిత్రి రేంజ్‌లో అయితే ఉండేది కాదు. ఆమె ఎక్కువగా డబ్బులు ఇచ్చేవారు కాదు. రైసు మిల్లర్లతో మాట్లాడి.. అభిమానులు తన ఇంటికి వచ్చినప్పుడు బియ్యం పంచి పెట్టేవారు. 25 కేజీలకు తగ్గకుండా.. అందరికీ బియ్యం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
దీంతో డబ్బులు ఇచ్చే సావిత్రికి ఉన్నంత అభిమానులు అంజలీదేవికి లేకుండా పోయారు. ఇద్దరి మధ్య అభిమానుల విషయంలో పెద్ద ఇగోలు, పంతాలు ఉండేవని టాక్ ? అప్పట్లో ఇదో పెద్ద విషయంగా ప్రచారం అయ్యేది.