నందమూరి నటసింహం బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న బాలయ్య 108వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. వర్థమాన హీరోయిన్ శ్రీలీల బాలయ్యకు కూతురు వరుస అయ్యే పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించేశారు.
తాజాగా బాలయ్య ద్వారా ఈ సినిమా టైటిల్ ముందే లీక్ అయిపోయినట్టు సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా ఓ నిర్మాత, బాలయ్య మధ్య జరిగిన చర్చల ద్వారా ఇది బయట పడిందని అంటున్నారు. ఆ బయటకు వచ్చిన టైటిల్ పేరు భగవత్ కేసరి. ఈ టైటిల్ పెడితే ఎలా ? ఉంటుందన్న చర్చలు సినిమా యూనిట్ మధ్య నడుస్తున్నట్టు టాక్ ?
అయితే ఈ భగవత్ కేసరి టైటిల్లో బాలయ్య బ్లాక్‌బస్టర్ అఖండతో పాటు ఆయనకు బాగా కలిసొచ్చిన సింహం సెంటిమెంట్లను మిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. అఖండ సినిమా టైటిల్ శివుడికి సింబాలిజమ్, అయితే ఈ సారి విష్ణువు పేరు స్ఫురణకు వచ్చేలా భగవత్ అన్న పదం తీసుకువచ్చారట. భగవత్ అంటే భగవంతుడు.. భగవత్ స్వరూపుడు విష్ణుమూర్తి.
ఇక కేసరి అంటే సింహం అని అర్థం. ఇది బాలయ్యకు లక్కీ సెంటిమెంట్. ఇప్పటికే పంజాబ్ కేసరి, ఆంధ్ర కేసరి అన్న పాపులర్ పేర్లు కూడా ఉన్నాయి. దీనిని హిందీలోకి డబ్ చేసుకున్నా హిందీకి కూడా వేరే టైటిల్ పెట్టక్కర్లేదు. పక్కాగా నార్త్ ఇండియాకు సరిపోయే టైటిల్ కూడా..! అందుకే భగవత్ కేసరి క్యాచీ టైటిల్ అయిపోయేలా ఉంది. ఈ సారి రెండి సెంటిమెంట్లను మిక్స్ చేసి పెట్టిన ఈ టైటిల్‌తో బాలయ్య బాక్సాఫీస్ దగ్గర ఎలా ? గర్జిస్తాడో ? చూడాలి.