బుల్లితెరపై స్టార్ యాంకర్స్ లో ఒకరిగా మంచి ఫామ్ లో దూసుకుపోతుంది శ్రీముఖి. బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటింది. బుల్లితెరపై ఎంత పాపులర్ యాంకర్ అయినా కూడా బిగ్‌బాస్‌లో మాత్రం ఆమె రన్నరప్‌తో సరిపెట్టేసుకుంది. బిగ్‌బాస్ షో తర్వాత వరుస అవకాశాలతో తన క్రేజ్ మరింతగా పెంచుకుంది. వెండితెరపై కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ బొద్దుగుమ్మ యాక్టర్ గా మంచి మార్కులు కొట్టేసింది.
ప్రస్తుతం బుల్లితెరకు మాత్రమే అంకితమైన శ్రీముఖి ఛాన్స్ దొరికితే చాలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో ముచ్చట్లు పెడుతుంటుంది. ఇక ప్రతిరోజు తన హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో చాలామంది వారి పెళ్లి విషయంపై మాత్రం ఎన్ని ప్రశ్నలు అడిగినా స్పందించరు.
శ్రీముఖి ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి గురించి ఎవరైనా అడిగినా ఆ ప్రశ్నలకు ఆన్సర్ దాటేస్తూ వస్తోంది. తాజాగా శ్రీముఖి పెళ్లిపై కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్, షేర్ చేసే శ్రీముఖి పెట్టిన ప్రతి స్టిల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటాయి. తాజాగా ఎల్లో కలర్ అవుట్ ఫిట్‌తో వేసుకున్న ఫొటోస్ దిగి షేర్ చేసింది శ్రీముఖి.
ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్ చాలామంది ఇంకెన్నాళ్లు ? అవే బోరింగ్ స్టిల్స్ తో ఫొటోస్ దిగి షేర్ చేస్తూ ఉంటావు.. ఏంటి ? మాకు ఈ టార్చరని కామెంట్స్ పెడుతున్నారు. మరి కొంతమంది చివరికి శ్రీముఖి ఆ ఫోటోగ్రాఫర్ ని పెళ్లి చేసుకునేలా ? ఉంది అంటూ… మరి కొందరు నిజంగానే ఫోటోగ్రాఫర్నే పెళ్లి చేసుకో శ్రీముఖీ రోజంతా ఫోటోలు దిగి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.