బిగ్ బాస్ బ్యూటీ శివ జ్యోతి యాంకర్ గా తన లైఫ్‌ని స్టార్ట్ చేసి ఎన్నో ఎత్తు పల్లాలను ఎదుర్కొంది. వీ6లో వచ్చిన తీన్మార్ వార్తల్లో యాంకర్ గా ఫేమస్ అయినా శివజ్యోతి కి ఆ పేరు కాస్త తీన్మార్ సావిత్రిగా మారిపోయింది. ఇప్పుడు బయట ఆమెను తీన్మార్ సావిత్రి అక్కగా అందరూ పాపులర్ చేసేశారు. దీనికి తోడు తెలంగాణ లాంగ్వేజ్‌లో ఆమె మాట్లాడే భాష… ఆమె సంప్రదాయ తీరు ప్రతి ఒక్కరిని ఫిదా చేసి.. ఆమెకు ఇంతమంది అభిమానులను తెచ్చిపెట్టింది.
తర్వాత 2019లో బిగ్‌బాస్ షో కి ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైన ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతుంది. శివజ్యోతి ఒక పక్క యాంకర్ గా పని చేస్తూనే మరోపక్క యూట్యూబ్ ఛానల్ లో కూడా రన్ చేస్తు మంచి పేరు సంపాదించుకుంది. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న జ్యోతి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
జ్యోతి సోషల్ మీడియా ప్రోగ్రామ్స్, సినిమా ప్రోగ్రామ్స్ చేస్తూ నెలకి రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు కూడబెడుతుందట. ఇక అలా శివజ్యోతి బీఎండబ్ల్యూ కార్, కియా కార్, హైదరాబాద్ లో సొంత ఇల్లుతో పాటు ఊర్లో కూడా ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంది. వాటిని తన యూట్యూబ్ ఛానల్లో వీడియో వ్లాగ్స్ ద్వారా అందరికీ చూపించింది. అలా కష్టపడి ఎదుగుతు శివజ్యోతి బాగానే ఆస్తులు కూడబెట్టుకుంటోంది.