తెలుగు యాంకర్ ఝాన్సీ.. ఒకప్పుడు బుల్లితెరపై పలు షోస్ చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తర్వాత అవకాశాలు తగ్గడంతో కాస్త వెనుకబడింది. అప్పట్లో సుమ ,ఉదయభాను, ఝాన్సీ లాంటి యాంకర్ల మధ్య గట్టి యుద్ధమే జరిగేది.. ఇక టాక్ ఆఫ్ ది టౌన్ షో తో ఝాన్సీ కి మంచి గుర్తింపు వచ్చింది. యాంకరింగ్ తో పాటు వెండి తెరపై కూడా కొన్ని సినిమాలో క్యారెక్టర్ అర్టిస్ట్‌గా నటిస్తూ సక్సెస్ సాధించింది ఝాన్సీ. కెరియర్ పరంగా దూసుకుపోతున్న ఝాన్సీకి వ్యక్తిగత జీవితంలో కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా ఝాన్సీ భర్త జోగినాయుడును ప్రేమ వివాహం చేసుకుంది. జోగినాయుడు ఒక నటుడు వీరికి కూతురు పుట్టక వీరిద్దరి మధ్యన ఏవో మనస్పర్ధలు కారణంగా విడిపోయారు.
అప్పుడప్పుడు వీరిద్దరి మధ్య మాటలు యుద్ధం నడుస్తూ ఉంటుంది. విడిపోయాక జోగినాయుడు తన సొంత మరదలు పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఝాన్సీ మాత్రం ఇంకా అలాగే ఉండిపోయింది. ఇక ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఝాన్సీ మాట్లాడుతూ నాకు చాలామంది అన్యాయం చేశారని నాకు అన్యాయం చేసిన వారికి నా ఉసురు కూడా తగిలిందని కొందరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఝాన్సీ ఓ పెద్ద డైరెక్టర్ రెండు రోజులపాటు నాతో క్యారెక్టర్ చేపించుకున్నాడని.. అయితే ఆ క్యారెక్టర్ నుంచి నన్ను తీసేసి వేరే వ్యక్తిని పెట్టుకుని సినిమాను తెరకెక్కించాడని ఆ సినిమాలో దమ్ము లేకపోవడంతో ఆ సినిమా ఫ్లాప్ అయింది అంటూ చెప్పుకొచ్చింది.
ఆ రెండు రోజులు ఆమె నటించినందుకు మనీ ఇచ్చేసిన ఆమెను తీసేసి వేరొక నటిని పెట్టడం ఆమెకు ఎంతో అవమానంగా అనిపించిందని వాపోయింది. ఇక ఆ తరువాత నేను ఓ హీరోతో ఎఫైర్ పెట్టుకున్నా..అని.. పోలీసులు రైడింగ్ లో పట్టు పడ్డాను అంటూ.. పోలీసులు అరెస్ట్ కూడా చేశారంటూ వార్తలు రాశారు. రైడింగ్ లో దొరికితే నేను ఇప్పుడు ఇలా ఎందుకు? ఉంటాను. నాకు అది ఎవరు? రాయించారు.. ఎందుకు? రాయించారో.. కూడా తెలుసు. దానికి వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారు అంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఝాన్సీ కి ఆ స్టార్ హీరోకి లింక్ ఎందుకు పెట్టారు? అంటూ నెట్టిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు.