తెలుగు ప్రేక్షకులలో అనసూయ అంటే తెలియని వారు ఉండరు. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ యాంకర్‌గా ఆమె అందరికీ సుపరిచితురాలే. అయితే సినిమాలలో ఇటీవల కాలంలో ఆమె బాగా రాణిస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పాత్రలు చేయడంతో పాటు నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలు కూడా చేస్తోంది. తాను ఎలాంటి పాత్రలైనా చేయగలనని నిరూపిస్తోంది. అందుకు తగ్గట్టే ఆమెకు చక్కని పాత్రలు లభిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం ఆమె వెకేషన్ మూడ్‌లో ఉంది. భర్త, పిల్లలతో కలిసి ఆమె వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ అందమైన లొకేషన్లలో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఇక ఆమె సోషల్ మీడియాలో నిత్యం బిజీగా ఉంటుందనే విషయం తెలిసిందే. తనపై నెగటివ్ కామెంట్లు చేసే వారితో ఏకంగా మాటల యుద్ధం చేస్తోంది.
ఇటీవల కాలంలో హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో ఆమెకు డైలాగ్ వార్ నడిచింది. దానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తానని ఆమె ఓ సందర్భంలో వెల్లడించింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఓ క్యాప్షన్‌తో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తాను రోజూ రాత్రి పడుకునేది తర్వాతి రోజు బ్రేక్ ఫాస్ట్ చేయడానికేనని ఆమె కామెంట్ పెట్టింది. ఇది చూసిన నెటిజన్లు ఔరా అనుకుంటున్నారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ కామెంట్ పెట్టడంతో పాటు ఆమె తన ఎర్లీ మార్నింగ్ లుక్‌కి సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. ఇక పొట్టి బట్టల్లో ఆమె కుర్రాళ్ల హృదయాల్లో సెగలు రేపుతోంది. హీరోయిన్లతో పోటీ పడే అందం ఆమెది. తన అందంతోనే కాకుండా అభినయంతోనూ ఆకట్టుకుంటోంది. ఇటీవల ఓటీటీలోనూ విడుదలైన విమానం సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను మెప్పించింది.
మరో వైపు అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2లో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. పుష్ప 1లో కనిపించింది కొద్ది సేపే అయినా ఆ పాత్రలో ఆమె ఆకట్టుకుంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌లో ఆమె జాయిన్ అయింది. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను తన అందంతో సమ్మోహితులను చేస్తోంది.