దొరసాని సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ. ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్గా నటించడంతో ఫోకస్ అంతా ఆమె పైకి వెలింది. సినిమా కొద్దిపాటి సక్సెస్ సాధించినా గుర్తింపు కేవలం శివాత్మికకు మాత్రమే వచ్చింది. ఆనంద్ దేవరకొండ ఈ సినిమాతో అంతగా ప్రొజెక్ట్ కాలేదు.
ఆ తర్వాత నటించిన మిడిల్ క్లాస్ మెలోడీ సినిమా హిట్ అయినా ఓటిటికే పరిమితం కావడం వల్ల ఈ సినిమాతో కూడా కమర్షియల్ హిట్ కొట్టలేకపోయాడు ఆనంద్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి హిట్ కాలేదు. ఎలాగైనా కమర్షియల్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో బేబీ సినిమాలో నటించాడు ఆనంద్ దేవరకొండ.
సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఈ జనరేషన్లో ఆడపిల్లలను మగవాళ్ళు ఎలా? మోసం చేస్తున్నారు అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరించాడు దర్శకుడు సాయి రాజేష్. ఎస్ కే ఎన్ ప్రొడక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా బాక్సాఫీస్ వద్ద నిలిచింది. రు. 8 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగి 4 రోజుల్లోనే ఏకంగా రు. 30 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది.
ఈ ఊపు చూస్తుంటే ఈ సినిమా రు.70 కోట్ల వసూళ్లు లాంగ్‌రన్‌లో రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినా కూడా మేజర్ క్రెడిట్ మాత్రం ఆనంద్ దేవరకొండ నటనకు రాలేదు. మొత్తం వైష్ణవి చైతన్యపై ఫోకస్ వెళ్ళింది. ఆమె సినిమాలో అన్ని వేరియేషన్స్ చూపిస్తూ అంత బాగా నటించడంతో వైష్ణవి చైతన్యకే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇంత పెద్ద హిట్ అయినా ఆనంద్ దేవరకొండకు ఆనందం లేకుండా పోయిందంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.