నేషనల్ క్రష్ రష్మిక మందన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.. అంతేకాదు ఈ వార్తలకు బలం చేకూర్చేలా వీరిద్దరూ తరచూ కెమెరా కంటికి చిక్కుతుండడంతో ఇక ఈ వార్తలు నిజమని ప్రతి ఒక్కరూ మరింత స్ప్రెడ్ చేశారు. కానీ ఏమైందో తెలియదు కానీ మళ్ళీ వీరిద్దరూ కలిసి కనిపించిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు వీరిద్దరి గురించి తాజాగా ఆనంద్ దేవరకొండ ఎదుర్కొన్న ఒక ప్రశ్న అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
అసలు విషయంలోకి వెళితే.. రౌడీ హీరో తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనదైన పంథా లో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డాడు ఆనంద్ దేవరకొండ.ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం బేబీ.. రాజేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయగా అంచనాలు భారీగా పెంచేసింది ఈ ట్రైలర్ .
ఇక జూలై 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ కార్యక్రమాలలో వేగం పెంచింది. అందులో భాగంగానే ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆనంద దేవరకొండకు విలేకరుల నుంచి ఒక ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది.. అదేమిటంటే.. బేబీ సినిమాలోని ఒక పాటను రష్మిక విడుదల చేసిన విషయం తెలిసిందే.. !
అదే సమయంలో అభిమానులు రష్మిక ను వదిన అని పిలిచారు కదా అని విలేకర్ ఆనంద్ దేవరకొండను అడగ్గా .. ఆనంద్ దేవరకొండ కొంచెం ఇబ్బందిగా ఫీలవుతూ .. దయచేసి ఆపండి.. లేదు నేను దీన్ని ఇక్కడితో ఆపేస్తాను.. ఇక సమాధానం చెప్పను అన్నట్టుగా ఆయన రిప్లై ఇచ్చారు. ఇక మొత్తానికైతే రష్మికను వదిన అని పిలవడం అతడికి ఇష్టం లేదు అన్నట్టుగా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారు ఆనంద్ దేవరకొండ . ప్రస్తుతం ఈ విషయం కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.