సీనియ‌ర్ ఎన్టీఆర్ ప‌క్క‌న హీరోయిన్లుగా న‌టించిన త‌ల్లి, కూతుర్లు ఎవ‌రో తెలుసా… వ‌ర‌ల్డ్ రికార్డ్‌..!

ఒకే హీరోకు జోడీగా తల్లి, కూతుర్లు హీరోయిన్లుగా నటించడం అంటే అది చాలా అరుదైన సందర్భం అని చెప్పాలి. హీరో ద్విపాత్రాభినయం చేసినప్పుడు హీరోయిన్లు నటించడం కాదు. తొలితరం హీరోయిన్గా తల్లి సదరు హీరోకు జోడిగా నటిస్తే.. తర్వాతి తరంలో కుమార్తె కూడా అదే హీరో పక్కన హీరోయిన్గా నటించ‌డం చాలా అరుదు అని చెప్పాలి.

అలా త‌ల్లి, కూతుర్ల ప‌క్క‌న హీరోగా చేసిన అరుదైన‌ రికార్డ్ సీనియర్ ఎన్టీఆర్‌ సొంతమయింది. ఆయన తల్లి కూతుర్లతోనూ వెండితెర మీద రొమాన్స్ చేశారు. ఆ హీరోయిన్లు ఎవరో ? కాదు. పాత తరం నటిమని అమ్మాజీ ఆమె కుమార్తె జ‌య‌చిత్ర కావటం విశేషం. ఎన్టీఆర్ హీరో అయిన‌ తొలినాళ్లలో బి సరోజ, దేవికతో కలిసి ఎక్కువగా సినిమాలలో నటించేవారు.

అదే సమయంలో ఆయన నటించిన దైవబలం సినిమాలో అమ్మాజీ హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత కాల క్రమంలో ఆయన తిరుగులేని స్టార్ హీరోగా ఎదిగి వెండితెర మహారాజు అయ్యారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు అమ్మాజీ కుమార్తె జ‌య‌చిత్ర – ఎన్టీఆర్ కలిసి మా దైవం సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ బాలన్ దర్శ‌కుడు.

అలా సీనియర్ ఎన్టీఆర్ పాతతరంలో తల్లి అమ్మాజీ తోను ఆ తర్వాత తరంలో ఆమె కుమార్తె జ‌య‌చిత్రతోను జోడిగా నటించి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఇక జ‌య‌చిత్ర అప్పట్లో సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. ఆమె వందకు పైగా సినిమాలలో నటించారు.