టాలీవుడ్లో ఉన్న స్టార్ సెలబ్రిటీ కపుల్స్ లో అక్కినేని నాగార్జున- అమల జంట కూడా ఒకటి. తెలుగు దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన సొంత టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా మారాడు నాగార్జున. 60 సంవత్సరాల వయసు వచ్చినా కూడా వరుస సినిమాలు చేస్తూ తన అభిమానులను అలరిస్తున్నాడు నాగార్జున. ఈయన వ్యక్తిగత జీవిత విషయం అందరికీ తెలిసిందే.
నాగార్జున ముందుగా దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మీని వివాహం చేసుకొని తర్వాత నాగచైతన్య పుట్టిన వెంటనే ఆమెకి విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత శివ సినిమాలో తనకు జంటగా నటించిన ఆమలతో ప్రేమలో పడ్డాడు నాగార్జున. వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. చివరికి అక్కినేని నాగేశ్వరరావుకు తెలియడంతో అమలతో నాగార్జున పెళ్లికి ఒప్పుకోలేదు.
నాగార్జున మాత్రం వెనక్కి తగ్గకుండా తాను అమలని పెళ్లి చేసుకుంటానని పట్టు పట్టడంతో నాగేశ్వరరావు ఒప్పుకున్నాడు. 1992లో ఎంతో సింపుల్‌గా నాగార్జున- అమల పెళ్లి జరిగింది. ఇక పెళ్లి తర్వాత అమల సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి సాధారణ గృహిలా మారిపోయింది. ఇక తర్వాత అమలకు అఖిల్ జన్మించాడు. అయితే అఖిల్ తో పాటు నాగార్జున మొదటి భార్య కొడుకు నాగచైతన్యను కూడా తన సొంత కొడుకులా చూసుకుంటూ వచ్చేది.
అందుకే అమల అంటే నాగ్‌కు ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే పెళ్లికి ముందు అమలకు ఇచ్చిన మాటను ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నాడు. అవును మీరు ఉంటున్నది నిజమే పెళ్లికి ముందే నాగార్జున నుంచి అమల ఓ మాట తీసుకుందట. అమలకు జంతువులు అంటే చాలా ఇష్టం.. అందుకే జంతువుల కోసం తన సంపాదనలో కొంత ఖర్చు పెడతానని ఆయనకు చెప్పిందట అలాగే నాగార్జున కూడా అందుకు సహకరించమని కోరిందట.
దానికి నాగార్జున వెంటనే ఓకే చెప్పారట. ఇక పెళ్లయిన వెంటనే సినిమాలుకు దూరమైన అమల తన భర్త అండతో బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ అనే జంతువుల పరిరక్షణ కేంద్రాన్ని మొదలుపెట్టి తన మానవత్వాన్ని ఇప్పటికీ చాటుకుంటూ గొప్ప మహిళగా మారింది. అలాగే పెళ్లికి ముందు అమలకు ఇచ్చిన మాట కోసం నాగార్జున ఇప్పటికీ తన సంపాదనలో కొంత భాగాన్ని ఆ జంతువుల కోసం ఖర్చు పెడుతూ వస్తున్నాడట.