తరుణ్ – ప్రియమణిల పెళ్లి ఆగిపోవడానికి కారణం ఆ హీరోయిన్ నేనా..? తెర వెనుక అంత కధ నడిచిందా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు ఒకే సినిమాలో నటిస్తే వాళ్లిద్దరి మధ్య ఏం లేకపోయినా ఏదో ఉందని గాసిప్స్ అప్పుడప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి.12 సంవత్సరాల క్రితం తరుణ్, ప్రియమణి హీరోహీరోయిన్లుగా నటించిన నవవసంతం సినిమా షూటింగ్ సమయంలో తరుణ్, ప్రియమణి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది.

తరుణ్, ప్రియమణి ఒకరికొరకు ఖరీదైన బహుమతులను, కార్లను ఇచ్చిపుచ్చుకున్నారని కూడా ప్రచారం జరిగింది. ప్రియమణి టయోటా ఇన్నోవా కారు కొనుక్కోగా తరుణ్ ఆ కారును కొని ఇచ్చారని గాసిప్స్ వినిపించాయి. అ స‌మ‌యంలో ఎక్కడ చూసినా ఈ ఇద్దరూ కనిపించేవారు. అది చూసి తరుణ్ అమ్మ రోజా రమణి ఒకరోజు సెట్స్‌కు వచ్చి మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలుసు.. పెళ్లి చేస్తానంటూ ఆఫర్ చేసింది. ఈ విషయం చెప్పింది కూడా ఎవరో కాదు ప్రియమణే.

అప్పట్లో తమ ఇద్దరి మధ్య ఉన్న క్లోజ్ నెస్ చూసి తరుణ్ వాళ్ల అమ్మ కూడా తప్పుగా అర్థం చేసుకుందని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. కానీ తరుణ్ వాళ్ల అమ్మ అలా చెప్పగానే మీరు అపార్థం చేసుకున్నారని చెప్పినట్లు తెలిపింది ప్రియమణి. అలా చెప్పిన తర్వాత ఆ విషయం అక్కడితోనే మరిచిపోయామని.. కానీ అప్పట్లో తరుణ్‌ను వాళ్ల అమ్మగారు పెళ్లి చేసుకోమ్మని మాత్రం అడిగారని చెప్పింది. అప్పుడు తాను ఓకే చెప్పుంటే ఈ రోజు తరుణ్ భార్య అయిపోయేది ప్రియమణి.

ఇదిలా ఉంటే 2017లో ముస్తాఫా రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్ళి తర్వాత కూడా కెరీర్‌లో వరస అవకాశాలు అందుకుంటుంది ప్రియమణి. ప్రస్తుతం తెలుగు, తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తోంది. తరుణ్ హీరోగా చిత్ర పరిశ్రమ నుంచి ఫెడవుట్ అయిపోయాడు.. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌తో నటుడుగా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు ఓ ఇంటర్వ్యూలో తరుణ్ అమ్మ రోజా రమ్మని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా త్వరలోనే తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా చెప్పింది.. ఇక ఇప్పుడు ఈ సంవత్సరమైనా తరుణ్ పెళ్లి చేసుకుంటారా ? లేదా అనేది చూడాలి.