స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. అయితే అదే రేంజ్ ఫాలోయింగ్ అతని భార్య అల్లు స్నేహారెడ్డి కి కూడా ఉంది. ఈమె సోషల్ మీడియా అకౌంట్లో పెట్టే ప్రతి పోస్ట్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. దీనితో పాటుగా అప్పుడప్పుడు ఆమె పెట్టే స్టైలిష్ ఫొటోస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతాయి.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన కుటుంబానికి సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకుంటది. అలాగే తన స్టైలిష్ లుక్స్, మార్వలస్ ఫ్యాషన్ టేస్ట్ తో అందరి మనసులు దోచుకునే వ్యక్తి స్నేహ. ట్రెండ్ ఫాలో అవ్వడమే కాకుండా తనకు తానే ఒక ట్రెండ్ సెట్ చేసుకుంది. అయితే ప్రస్తుతం ఈమె పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియా వేదికగా స్నేహ తన భర్తను రొమాంటిక్గా ముద్దు పెట్టుకుంటున్న ఫోటోతో పాటు ఓ చిన్న క్యాప్షన్ కూడా షేర్ చేసింది. అందులో ఆమె తనకు వంట చేయడం కంటే ముద్దు పెట్టడమే బాగా వచ్చు అని రాసిన కొటేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్నేహ ఎంత రొమాంటిక్ అని కొంతమంది అభిప్రాయపడుతుంటే, మరి కొంతమంది మాత్రం మరి ఇలా పబ్లిక్ గా చెప్పడం అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు.
ఏదేమైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఈ పోస్ట్ ను విపరీతంగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. స్నేహ సినిమాలకు ఎంతో దూరంగా ఉన్నప్పటికీ.. ఆమె అంటే అల్లు అర్జున్ అభిమానులకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఇటు పిల్లల ను అటు కుటుంబ బాధ్యతలను చూసుకోవడమే కాకుండా ఎంతో సమర్థవంతంగా బిజినెస్ కూడా రన్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.