టైటిల్ చూస్తే మీకు విడ్డూరంగా ఉంది అనుకుంటున్నారా..కానీ ఇది నిజమే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సూపర్ హిట్ సినిమా కారణంగా చిరు మేనల్లుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. అలా డబ్బులు పోగొట్టుకున్న సినిమా మరేదో కాదు చిరంజీవి బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఇంద్ర. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. ప్రకాష్ రాజ్, శివాజీ, తనికెళ్ల భరణి వంటి అగ్ర నటులు ఈ సినిమాలో కీలకపాత్రలో నటించారు.
వైజయంతి మూవీ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా 2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అదేవిధంగా ఈ సినిమాలో దాయి దాయి దామ్మా అనే పాటలో చిరు వేసిన వీణ స్టెప్ ఇప్పటికీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఇక అసలు విషయానికొస్తే అల్లు అర్జున్ తన మామ చిరంజీవి నటించిన ఈ సినిమాను 17 సార్లు చూశాడట. అంతలా ఈ సినిమా ఆయనకు నచ్చేసిందట. అదే సమయంలో ఈ సినిమా విడుదలైన కొద్దిరోజులకి అల్లు అర్జున్ తన స్నేహితులతో అనుకోకుండా పందెం కట్టాల్సి వచ్చిందిట. అది ఏమిటంటే ఈ సినిమాలో చిరంజీవి వేసిన దాయి దాయి దామ్మా సాంగ్ లో వీణ స్టాప్ చేసే సమయంలో ఆయన పక్కన హీరోయిన్ సోనాలి బింద్రే ఉంటుందని ఆయన స్నేహితులు చెప్పగా దానికి అల్లు అర్జున్ వారితో నో చెప్పారట.
ఇక తన మామ చిరంజీవి ఆ పాటలో సోలోగానే స్టెప్ వేశాడంటూ వారితో యుద్ధానికి దిగారట. 17సార్లు ఈ సినిమా చూశాను నాకు తెలియదా అంటూ వారితో మొండిగా ప్రవర్తించారట. ఈ నేపథ్యంలోనే వారితో మాట మాట పెరిగి రూ.25000 పందెం కట్టాడట. ఇక తీరా ఈ పాట చూశాక చిరంజీవి పక్కన సోనాలి బింద్రే కూడా డాన్స్ చేసినట్టు ఉంది. ఈ విధంగా చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమా వాళ్ళ అల్లు అర్జున్ రూ.25000 పోగొట్టుకున్నాడు. ఇదే విషయాన్ని అల్లు అర్జున్ పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.