అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్ స్టోరీ లీక్‌… స‌లార్‌, బాహుబ‌లి స్టైల్లో ఊహించ‌ని ట్విస్ట్‌..!

అల్లు అర్జున్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు రిలీజై హిట్ గా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్ లోనే నాలుగో సినిమా రాబోతుందంటు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కెరీర్‌లో 22వ సినిమాగా తెర‌కెక్క‌న్నున్న ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ – గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు బ‌య‌ట‌కు రావ‌డంతో ఇవి ప్రేక్షకుల్లో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా స్టోరీ మెయిన్ లైన్‌ లీక్ అయినట్టు తెలుస్తుంది. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా ఫుల్ యాక్షన్ ఫ్యాక్ట్ స్టోరీగా… సోషల్ ఫాంటసీ నేపథ్యంలో రాబోతుందంటున్నారు. సలార్, బాహుబలి సినిమాల్లాగానే మహాభారతంలో రెండు పర్వాలను తీసుకొని ఆ స్టోరీ లైన్స్‌కు మోడరన్ టచ్ ఇచ్చి రెండు భాగాలుగా తీయాలని ఆలోచనతో ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది.

ఈ సినిమా రజనీకాంత్ నటించిన దళపతి సినిమాల ఉంటుందని టాక్. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయి. త్రివిక్రమ్ సినిమా అంటేనే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి. ఈ సినిమా తప్పక హిట్ అవుతుంది అనే ఆశతో ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. క‌థ‌లో కంటెంట్ కారణంతోనే త్రివిక్రమ్ చేసిన దాదాపు అన్ని సినిమాలు హిట్ సాధించాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప‌ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసు. ఈ సినిమా పార్ట్ 1 పాన్ ఇండియా రేంజ్‌లో పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. కాగా పార్ట్ 2 వ‌చ్చే ఏడాది వేసవిలో రిలీజై ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.