అల్లు అర్జున్ పెళ్లికి ముందే స్నేహ రెడ్డికి అంత ఖరీదైన‌ బహుమతులు ఇచ్చాడా అవి ఎంత స్పెషల్ అంటే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీ కి ఎంత గౌరవం ఇస్తాడు ఫ్యామిలీ కూడా అంతే గౌరవం ఇస్తాడు. సంవత్సరంలో కనీసం ఐదారు సార్లు అయినా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటాడట. అంతేకాకుండా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఇది పక్కన పెడితే అల్లు అర్జున్ తన భార్యకి పెళ్లి కాకముందే ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడట. మరి అల్లు అర్జున్ స్నేహ రెడ్డికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బన్నీ- స్నేహ రెడ్డి లవ్ స్టోరీ మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి కాకముందు చాలా రోజులు ప్రేమలో ఉండి ఇంట్లో వాళ్లని పెళ్లి కి ఒప్పించుకున్నారట. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారు. అయితే అల్లు అర్జున్ పెళ్లికి ముందే తనకు కాబోయే భార్య కోసం ఖరీదైన స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడట. స్నేహ రెడ్డి- అల్లు అర్జున్ ల ఎంగేజ్మెంట్ కి ఒక రోజు ముందు అల్లు అర్జున్ తనకి కాబోయే భార్యకు దగ్గరికి వెళ్లి ఎవ‌రు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడట. అదేంటంటే ఎంగేజ్మెంట్ కు కట్టుకునే సారీ దాదాపు లక్షకు పైగా ఖరీదు ఉంటుందట.

అంతే కాదు తన ప్రేమకి గుర్తుగా దాదాపు రూ.40లక్షల విలువ చేసే డైమండ్ రింగ్ ని కూడా బహుమతిగా ఇచ్చాడట. అలాగే ఎంగేజ్మెంట్ రోజు వేసుకోవడానికి దాదాపు రూ.60 లక్షల ఖరీదు చేసే నగలను కూడా ప్రేమతో తన భార్యకి ఇచ్చాడట. అయితే ఎంగేజ్మెంట్ కి ముందే ఇవన్నీ ఇవ్వడంతో అల్లు ఫ్యామిలీ కూడా షాక్ అయ్యారట. ఇలా పెళ్లికి ముందే తన భార్యపై ఉన్న ప్రేమని ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఖరీదైన బహుమతులు ఇచ్చి తన ప్రేమను బయటపెట్టాడట.