ద బెస్ట్ టాలీవుడ్ ఫిమేల్ యాంకర్ అనగానే అందరికి టక్కున గుర్తుకు వచ్చేది సుమ. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 2 దశాబ్దాలు దాటుతున్నా బుల్లితెరపై పలుషోలలో యాంకరింగ్ చేస్తూ మంచి ఫామ్ లో దూసుకు వెళుతోంది. కొన్ని ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుమ ఏదైనా షో యాంకరింగ్ చేసిందంటే అది కచ్చితంగా భారీ రేటింగ్స్ గ్యారెంటీ అనే అంచనా ఉండేది. ప్రస్తుతం సుమ ఈటీవీలో పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తుంది. ఈమె ఈటీవీలో నిర్వహిస్తున్న షోలకు అంతగా రేటింగ్ రావడం లేదట.
అలాగే మరో టాలీవుడ్ యాక్టర్, కమెడియన్ అలీ నిర్వహిస్తున్న షోకి కూడా రేటింగ్ బాగా తగ్గిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈటీవీలో ఇప్పటికే ఎన్నో రకాల షోలు టెలికాస్ట్ అవుతున్నాయి. ఢీ జోడి, జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ , సుమ అడ్డా, ఆలీతో ఆల్ ఇన్ వన్ ఇలా చాలా షోలు టెలీకాస్ట్ అవుతున్నాయి. ఈ షోలన్నీ ఎప్పటినుంచో రన్ అవ్వడంతో జనాలకి పాతగా అనిపిస్తున్నట్టు ఉండడంతో ఈ షోలకు ప్రస్తుతం పెద్దగా రేటింగ్ రావట్లేదు.
జబర్దస్త్ షోకు నిన్న మొన్నటి వరకు రేటింగ్ బానే వచ్చినా సుడిగాలి సుధీర్ , గెటప్ శీనుషో నుంచి బయటకు వెళ్లిన తరువాత రేటింగ్ విషయంలో ఈ షోలు కూడా కాస్త వెనకబడ్డాయట. ప్రస్తుతం ఆటో రాంప్రసాద్, ఆది కొన్ని షోలను దాదాపు హిట్ చేస్తు జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో రేటింగ్ భాగుండాలని ప్రయత్నిస్తున్నారు.
సుమ అడ్డా విషయానికి వస్తే స్టార్టింగ్ లో చిరంజీవి గెస్ట్ గా వచ్చిన ఈషో రేటింగ్ మాత్రం దారుణంగా 2.95 మాత్రమే ఉందట. ఇక ఆలీతో జాలీగా అనే షో మధ్యలో బ్రేక్ ఇచ్చిన అలీ పాలిటిక్స్ లో బిజీ అయ్యాడు. ఇటీవల ఆలీతో ఆల్ ఇన్ వన్ అనే షోను ప్రారంభించినా ఈ షో డిజాస్టర్ గా నిలిచింది. దీనికి కేవలం 1.25 రేటింగ్ మాత్రమే వచ్చిందని సమాచారం. ఇలానే ఈటీవీలో షోలు కొత్తదనం లేకుండా కంటిన్యూ అయితే కష్టమే అంటూ కామెంట్ చేస్తున్నారు చాలా మంది నెటిజన్స్.