‘ ఆదిపురుష్‌ ‘ … ఓం రౌత్ చేసిన బ్లండ‌ర్ మిస్టేక్స్ ఇవే… చాలా ఘోరాతి ఘోరం..!

ఊరిస్తూ వ‌చ్చిన ఆదిపురుష్ ఎట్ట‌కేల‌కు రిలీజ్ అయ్యింది. ఓం రౌత్ ప్ర‌య‌త్నం మెచ్చుకోద‌గ్గ‌దే అయినా కొన్ని త‌ప్పులు మాత్రం ఘోరంగా ఉన్నాయ‌నే తెలుస్తోంది. సీతాదేవిని రావ‌ణుడు తీసుకువెళుతున్న‌ప్పుడు భూమితో స‌హా ఎత్తుకు వెళ‌తాడు. అయితే ఇందులో సీత‌ను ఏకంగా తాళ్ల‌తో బంధించి తీసుకువెళ్ల‌డం పెద్ద త‌ప్పుగా చెపుతున్నారు.

The trailer of Prabhas, Kriti Sanon, and Saif Ali Khan's Adipurush is better than the teaser; is it enough?-Entertainment News , Firstpost

ఇక రావణాసురుడి గెట‌ప్ నుంచి లంక వ‌ర‌కు మ‌నం ఉన్న‌ది లంక‌లో కాదు.. అదేదో లోకంలో అన్న‌ట్టుగా ఉంద‌ని చూసిన వాళ్లు చెపుతున్నారు. ఇక రావ‌ణుడి భార్య మండోదరి, విభీషణుడి భార్య శరమ, శూర్పణక అందరూ ఈ కాలం నాటి పేజ్ 3 లేడీస్‌లా ఉన్నార‌న్న సెటైర్లు ప‌డుతున్నాయి. వీళ్ల‌ల్లో ఎవ్వ‌రికి మోహాన క‌ట్టుబొట్టు లేదు. రావ‌ణుడు అయితే ఓ సీన్‌లో ఘోరంగా కొండచిలువలతో బాడీ మసాజ్ చేయించుకుంటూ ఉంటాడు.

Prabhas Recalls Stressing Out After 3 Days Of 'Adipurush' Shoot: 'It's The Most Precious Film, Can I Do It?'

అస‌లు ఈ సినిమా హిందూ దేశ‌మైన భార‌తీయ బ్యాన‌ర్‌, భార‌తీయుడు తీసిన‌ట్టుగా కాకుండా ఎవ‌రో తెలిసి తెలియ‌ని ఫారిన‌ర్ తీసిన‌ట్టుగా ఉంద‌ని చెపుతున్నారు. ఇక వానరుల్లో హనుమంతుడు మాత్ర‌మే హనుమంతుడిలా ఉన్నాడు. వాలి సుగ్రీవులు చింపాంజీల్లా.. మిగిలినోళ్లు గొరిల్లాల్లా ఉన్నార‌ట‌.

Adipurush' teaser out; most precious film, says Prabhas

ఇక లంక‌లో రావ‌ణ‌సేన అంటే అవేవో వింత జీవులు ఉన్న‌ట్టుగా ఉన్నాయ‌ట‌. కొన్ని చోట్ల సినిమాలో జాంబీల్లాంటి వింత జీవులు క‌నిపిస్తాయి. ఇందులో బ్ర‌హ్మ‌దేవుడు చ‌తుర్ముఖుడు కాకుండా ఏ దివ్య తేజ‌స్సు లేకుండా సింపుల్‌గా ఓ రాజ‌గురువులా ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం కూడా విచిత్రంగా ఉందంటున్నారు. ఇక రావ‌ణుడు కొన్ని చోట్ల కుంటుతూ న‌టించ‌డం ఏంట్రా బాబు ? అని జ‌నాలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

Adipurush' Teaser Out; Most Precious Film, Says Prabhas

ఇక చాలా చోట్ల డైలాగులు కూడా తెలుగు వెర్ష‌న్‌లో తేలిపోయాయ‌ని.. లిప్‌సింక్ కూడా స‌రిగ్గా మ్యాచ్ కాలేదంటున్నారు. ఒక చోట రావ‌ణుడు వెల్డింగ్ ప‌ని చేసుకుంటూ ఉంటాడ‌ట‌. అస‌లు రావ‌ణుడు వెల్డింగ్ ప‌ని చేసుకోవ‌డం ఏంట‌ని కామెడీ అనే అంటున్నారు జ‌నాలు. అలాగే హ‌నుమంతుడికి త‌న గుర్తుగా చూడామ‌ణి ఇవ్వాల్సిన సీత త‌న చేతి గాజును ఇస్తుంది. ఇలా ఓవ‌రాల్‌గా ఈ సినిమాలో చాలా త‌ప్పులు జ‌రిగాయ‌న్న కామెంట్లు నెటిజ‌న్ల నుంచి వ‌స్తున్నాయి.