యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ లెక్కలు రోజు రోజుకు భలే మలుపులు తిరుగుతున్నట్టు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ జీఎస్టీతో కలుపుకుని రు. 185 కోట్లకు పీపుల్స్ మీడియా కొన్నట్టు టాక్ బయటకు వచ్చింది. అసలు పీపుల్స్ వాల్లు ఏ ధైర్యంతో ఈ రిస్క్ చేశారో ట్రేడ్ వర్గాలకే తెలియక తలలు పట్టుకుంటున్నారు.
ఇప్పుడు ఓ ఏరియాకు హోల్‌సేల్‌గా బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. వెస్ట్ గోదావరికి జిల్లా టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉషా పిక్చర్స్ మరి కొందరితో కలిసి ఆంధ్రా ఏరియాకు హోల్‌సేల్‌గా కొనేందుకు ముందుకు వచ్చిందట. ఈస్ట్‌కు చెందిన అనుశ్రీ ఫీలింస్ వాల్లు కూడా ఉషా వాళ్లతో కలిసి ఈ డీల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ డీల్ ఎన్ని కోట్లు అన్నది పూర్తిగా తెలియకపోయినా రు. 60 – 65 కోట్ల మధ్యలో చర్చలు జరుగుతున్నట్టు భోగట్టా..! అంటే రు. 50 కోట్ల నాన్ రికవరబుల్ అడ్వాన్స్, మరో రు. 15 కోట్లు రికవరబుల్ అడ్వాన్స్ కింద కొంటాం అని ప్రతిపాదన పెట్టారట. అంటే సినిమా ప్లాప్ అయినా, వసూళ్లు రాకపోయినా పీపుల్స్ వాళ్లు రు. 15 కోట్లు వెనక్కు ఇవ్వాలి. ఇది పీపుల్స్ వాళ్లకు కాస్త రిస్క్ ప్యాక్టర్ అవుతుంది.
అందుకే ఇప్పుడు ఈ భేరం చర్చల దశలో ఉందని తెలుస్తోంది. నిజంగా రు. 65 కోట్ల రేషియో లో బిజినెస్ డీల్.. అది కూడా ఆంధ్రా ఏరియా వరకు అంటే మంచి రేటే అంటున్నారు. అయితే పీపుల్స్ వాళ్లకు రిస్క్ లేకుండా రు. 70 కోట్ల నాన్ రికవరబుల్ అడ్వాన్స్ రేషియోలో ఆలోచన చేస్తున్నారట.