స్టార్ హీరోయిన్‌ సాయి పల్లవి సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిందా…!

చిత్ర పరిశ్రమలో ఉండే సెలబ్రిటీలు బయటికి ఎంతో పద్ధతిగా కనిపించే చాలామంది సెలబ్రెటీలు వారి నిజ జీవితంలో మాత్రం ఎంతో డిఫరెంట్ గా ఉంటారు. వారు నటించే సినిమాల్లో ఎంతో సంప్రదాయమైన పాత్రలో నటిస్తూ ఉంటారు కానీ బయట వారు చేసే పనులు వారి ప్రవర్తన ఎంతో విడ్డూరంగా ఉంటుంది. ఈ రీసెంట్ టైమ్స్ లో చాలామంది సీనియర్ హీరోయిన్లు బుల్లితెరపై ఎంతో పద్ధతిగా సాంప్రదాయంగా కనిపిస్తూ సోషల్ మీడియాలో మాత్రం వారు చేసే పనులు ఎంతో దారుణంగా కనిపిస్తున్నాయి.

ఇప్పుడు ఈ విషయాలన్నీ ఇలా ఉంచితే మన టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ సాయి పల్లవి. ఇక ఈమె తన కెరీర్ లో ఇటువంటి గ్లామర్ పాత్రలో నటించకుండా.. ఎలాంటి హద్దులు దాటకుండా తన నటనతోనే మెప్పించింది. ఒకవేళ ఏ దర్శకుడైన గ్లామ‌ర్‌ షో చేయమని రెమ్యూనరేషన్ ఎక్కువ ఆఫర్ చేసినా… అలాంటి సినిమాలను మధ్యలోనే వదిలేస్తాను కానీ అలాంటి పనులు మాత్రం చేయనని మొహం మీద చెప్పేస్తుంది.

అలాంటి ఈ నేచురల్ హీరోయిన్ తన నిజ జీవితంలో సిగరెట్ తాగుతుందంటూ ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఆ వార్త నిజమే అని ఈ విషయాన్ని స్వయంగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అసలు విషయం ఏమిటంటే సాయి పల్లవి ఎంబిబిఎస్ చదివిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈమె సినిమాల్లో హీరోయిన్ అవ్వకపోతే డాక్టర్‌గా పని చేసేదాన్న‌ని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పింది.

అలాంటి ఈ సాయి పల్లవి పొగ తాగు కొడుదు అనే విషయంపై అవేర్నస్‌ చేసే కార్యక్రమంలో పాల్గొని డమ్మీ సిగరెట్ తాగి దానివల్ల కలిగే నష్టాలు ఏమిటో వారికి వివరించిందట. సాయి పల్లవి రియల్ గా సిగరెట్ తాగుతున్నట్లు నటించడం చూసిన చాలామంది.. నీలో మంచి హీరోయిన్ ఉంది అంటూ ఆమెను పొగిడారట. ఈ విధంగా అక్కడ సాయి పల్లవి పొగ తాగకూడదు అనే క్యాంపైన్‌లో సీక్రెట్‌గా తాగింది అనే విషయాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.