ప్రభాస్ కోసం నా భర్తకు కూడా వార్నింగ్ ఇస్తా అంటోన్న చిరంజీవి హీరోయిన్‌…!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన రంభ 90వ దశకంలో దాదాపు అగ్ర హీరోలుగా ఉన్న అందరితో నటించింది. రంభ అస‌లు పేరు విజ‌య‌ల‌క్ష్మి. ఆమె స్వ‌స్థ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ‌. ఆమె కు చిన్న‌ప్ప‌టి నుంచి హీరోయిన్ అవ్వాల‌న్న కోరిక ఎక్కువ‌. ఈ క్ర‌మంలోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ప్రోత్సాహంతో త‌క్కువ టైంలోనే మంచి పాపుల‌ర్ అయ్యింది. రంభ తన అందం అభినయంతో పాటు డాన్స్ తో కూడా ప్రేక్షకులను మెప్పించి కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. చిరంజీవికి జోడీగా ఆమె చేసిన హిట్ల‌ర్, బావ‌గారు బాగున్నారా సినిమాలు ఆమె కెరీర్‌ను ట‌ర్న్ చేసేశాయి. రంభ‌ తెలుగు తమిళ భాషల్లోనే కాకుండా బాలీవుడ్ భోజపురి ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగానే సినిమాల‌కు బ్రేక్ ఇచ్చి ఇంద్ర‌కుమార్ అనే మలేషియన్ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకుంది రంభ‌. అయితే ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు.పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రంభ రీఎంట్రీ తర్వాత పలు ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించింది.
ఇక ప్రస్తుతం సినిమాలుకు దూరంగా ఉంటుంది ఈ సీనియర్ అందాల భామ.

ఇదే క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రంభ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాన్‌ఇండియా హీరో ప్రభాస్‌తో కలిసి నటించాలనేది నా కల. ఆయనతో నటించే అవకాశం వస్తే నా భర్తతో గొడవపడైనా సరే ఆ సినిమాలో కచ్చితంగా నటిస్తానని రంభ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు రంభ- ప్రభాస్ గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మరి రాబోయే రోజుల్లో అయినా రంభ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.