పైకి పద్ధతిగా కనిపించే నిత్య మీనన్లో ఈ యాంగిల్ కూడానా… ఇంతమంది హీరోల‌ను ముంచేసిందా..!

నాని హీరోగా వచ్చిన అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నిత్యమీనన్. మలయాళం నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ చిత్ర పరిశ్రమలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్‌గా రాణించినా ఎలాంటి క్యారెక్టర్ అయినా అవలీలగా చేయగల హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

అలాంటి ఈ హీరోయిన్ సినీ కెరీర్లో కూడా ఎన్నో ప్రేమాయణాలు ఉన్నాయంటూ కొన్ని వార్తలు వైరల్ గా మారాయి. అయితే నిత్యమీనన్ తన సిని కేరీర్‌లో ఇప్పటివరకు ఎంతమంది హీరోలతో ఎఫై..* పెట్టుకుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా నిత్యమీనన్‌ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా అలా మొదలైంది. ఈ సినిమాలో హీరోగా నాని నటించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నిత్యమీన‌న్‌ నాని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి.

ఎవరూ ఊహించిన విధంగా నాని అంజన అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని నిత్యామీనన్ తో తన ప్రేమకు పులిస్టాప్ పెట్టేసాడు. ఆ తర్వాత మరో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో కూడా నిత్యామీనన్ ప్రేమలో పడిందట. ఇప్పటికే దుల్కర్ కు వేరే అమ్మాయితో పెళ్లి జరిగిందంట. దుల్క‌ర్‌ ప్రేమ విషయం తెలుసుకున్న తండ్రి ముమ్ముట్టి ఎలాగై నిత్యా మీనన్‌కి తన కొడుకుతో ఉన్న బంధాన్ని విడగొట్టాలని ఆమెను మలయాళ చిత్ర పరిశ్రమలో బ్యాన్ చేయించాడ‌ని.. అందుకే వీరి ప్రేమ కూడా మధ్యలోనే ముగిసిందంటారు. ఆ తర్వాత మరో టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ తో కలిసి ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాల్లో నటించింది.

ఈ సినిమాల షూటింగ్ సమయంలో కూడా నితిన్- నిత్యామీనన్ ప్రేమించుకున్నారని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు బయటకు రావడంతో నితిన్ అక్క నికితా రెడ్డి ఒప్పుకోలేదట. దాంతో వీరి ప్రేమకు కూడా మధ్యలోనే బ్రేకప్ అయిపోయింది. ఆ తర్వాత మరో యంగ్ హీరో శర్వానంద్ తో కలిసి మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే సినిమాలో కలిసి నటించింది. ఈ సినిమా సమయంలోనే శర్వానంద్- నిత్యమీనన్ మధ్య మంచి బంధం ఏర్పడింది. ఆ బంధంతోనే వీరిద్దరూ పబ్బులు, పార్టీలంటూ తిరుగుతూ టాలీవుడ్ లోనే ఒకసారి హాట్ టాపిక్ గా మారారట.

ఆ తర్వాత ఏమైందో కానీ నిత్యామీనన్ కన్నడ స్టార్ హీరో సుదీప్ కు జంటగా కలిసి ఓ సినిమా చేస్తున్న సమయంలో సుదీప్ తో ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు రెండు సంవత్సరాలపాటు డేటింగ్ లో ఉన్నారట. అంతేకాదు సుదీప్ తన భార్యకి విడాకులు ఇచ్చి నిత్య మీనన్‌ని రెండో పెళ్లి చేసుకోవాలని కూడా భావించారట. అయితే ఈ విషయం తెలుసుకున్న సుదీప్ కూతురు కన్నడ చిత్ర పరిశ్రమ పెద్దలను కలిసి నిత్య మీనన్ కి వార్నింగ్ ఇప్పించిందట. దాంతో వీరి ప్రేమ అక్కడితో ముగిసింది. అలా నిత్యమీనన్ పైకి ఎంతో పద్ధతిగా కనిపిస్తూ తన కెరీర్ లో ఎంతమంది హీరోలతో నడిపింద‌న్న రూమార్లు ఆమెపై వ‌చ్చాయి.