లావణ్య త్రిపాఠి..ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. తాజాగా వరుణ్ తేజ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకొని మెగా కోడలు అయ్యింది. త్వరలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం ఘనంగా జరగనుంది. ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. తక్కువ టైంలోనే మంచి మంచి సినిమాల్లో నటించింది. అందాల రాక్షసి సినిమాతో లావణ్య ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్ తోపాటు నాగ చైతన్య నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించింది.
అయితే ఇప్పుడు సినిమాల్లో స్పీడ్ తగ్గించినా తాజాగా ఒక వెబ్ సిరీస్ లో అదరగొట్టింది. పులి-మేక అంటూ ఓ వెబ్ సిరీస్ లో పోలీసు అధికారిగా నటించింది. ఈ సిరీస్ కాకుండా మరికొన్ని సిరీస్ లు కూడా చేస్తున్నట్టు సమాచారం. సినిమాలు, సిరీస్ లు కాకుండా లావణ్య సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. వరుస ఫోటో షూట్ లతో మరింత ఫాలోయింగ్ పెంచుకుంటుంది. కొత్త కొత్త ఫోటోలు షేర్ చేస్తుంది.
ఇందులో భాగంగా తెలుపు రంగు చీరలో దర్శనమిచ్చింది లావణ్య. ఆమె ఆ చీరలో చాలా హుందాగా కనపడుతోంది. మెగా కోడలి ఫోటోలు అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాను తెలుపు రంగును చాలా పవర్ ఫుల్ కలర్ గా భావిస్తానంటూ ఆమె క్యాప్షన్ లో పేర్కొనడం విశేషం. ఈ ఫోటో షేర్ చేసిన కొన్ని క్షణాల్లోనే నెట్టింట వైరల్ అయ్యింది. చీరలో చాలా అందంగా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లావణ్య పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం తగ్గనంటూ కాస్త సంప్రదాయంగానే సిగ్నల్స్ ఇస్తోందని కూడా నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.
వరుణ్ తేజ్, లావణ్య 7 సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ కలిసి అంతరిక్షం, మిస్టర్ సినిమాల్లో నటించారు. మొదటి సినిమా చేసినప్పుడు వీరు ప్రేమలో పడ్డారంట. అయితే ఇదివరకే వీరి మీద ఎన్నో రూమర్స్ వచ్చేవి. అయితే వీరు స్పందించకపోవడంతో అందరు లైట్ గా తీసుకున్నారు. అయితే తాజాగా వీరిద్దరి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. దీంతో వీరి ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.